జైల్లో ఆడ వాసనకు దూరం గా సెక్స్ బాబా

జైల్లో ఆడ వాసనకు దూరం గా సెక్స్ బాబా

భ‌క్తి పేరుతో కోట్లాది మందిని మోసం చేసిన డేరాబాబా అలియాస్ గుర్మీత్ అనుభ‌వించిన రాజ‌భోగం.. విలాస జీవితం ఇప్పుడు అంద‌రికి తెలిసిందే. అధ్యాత్మిక‌తను అడ్డం పెట్టుకొని అత‌గాడు చేసిన వికృత చేష్ట‌లు ఇప్పుడు అంద‌రికి తెలిశాయ‌ని చెప్పాలి. ఇద్ద‌రు సాధ్వీల‌ను అత్యాచారం చేసిన కేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న డేరాబాబా ఇప్పుడు ఎలా ఉన్నార‌న్న విష‌యంపై కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. సుమారు రూ.1100 కోట్ల సంప‌ద ఉన్న డేరా బాబా ఇప్పుడు జైల్లో గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాడ‌ట‌.

జైల్లో అత‌నికి ప్ర‌త్యేకంగా ఎలాంటి సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేద‌న్న విష‌యాన్ని జైలు అధికారులు చెబుతున్నారు. ఇక‌.. జైలు జీవితం మీద వ‌స్తున్న క‌థ‌నాల‌కు భిన్నంగా హ‌ర్యానా  జైళ్ల శాఖ డీజీపీ కేపీ సింగ్ తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. జైల్లో గుర్మీత్ ఎలా ఉన్నార‌న్న విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు. గుర్మీత్ జైలు జీవితం గురించి ఆయ‌న చెబుతూ.. అంద‌రి ఖైదీల మాదిరే జైల్లో ఉన్న బాబాకు సైతం ప‌ని అప్ప‌గించార‌న్నారు.  రోజూ తోట ప‌నిని అప్ప‌గించార‌ని.. కూర‌గాయ‌లు పెంచే బాధ్య‌త‌ను ఆయ‌న‌కు ఇచ్చార‌న్నారు.

ఎలాంటి నైపుణ్యం లేని వ్య‌క్తిగా డేరా బాబాను ప‌రిగ‌ణించి తోట‌ప‌ని అప్ప‌గించిన‌ట్లుగా పేర్కొన్నారు. ప‌ని చేసినందుకు గుర్మీత్‌కు రోజూ ఇచ్చే వేత‌నం రూ.20కి మించ‌లేద‌న్నారు. నైపుణ్యం లేని ఖైదీల‌కు హ‌ర్యానా జైళ్ల‌లో ఇచ్చే జీతం ఇంతేన‌న్నారు. టీవీ.. పేప‌ర్ ఇలాంటివేమీ గుర్మీత్‌కు అందుబాటులో లేవ‌న్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. మ‌ల్టీ టాలెంట్లు ఉన్న గుర్మీత్‌ను ఎలాంటి నైపుణ్యం లేని ఖైదీగా అధికారులు గుర్తించ‌టం.

డేరాబాబా హ‌వా న‌డుస్తున్న వేళ‌.. త‌న ఆశ్ర‌మంలో తాను పండించే కూర‌గాయాల‌కు ఒక్కో కూర‌గాయ చొప్పున వంద‌ల్లో ఛార్జ్ చేసిన అమ్మిన ఘ‌నుడు. ఈ రోజున అదే వ్య‌క్తి  సునారియా జైల్లోని 500-600 గ‌జాల్లో కూర‌గాయ‌ల్ని పెంచాల్సి రావ‌టం.. అది కూడా రోజు కూలీ రూ.20ల‌కు కావ‌టం గ‌మ‌నార్హం.

డేరా బాబా పెంచే కూర‌గాయ‌ల్ని బ‌య‌ట‌కు అమ్మ‌రు. జైలు అవ‌స‌రాల‌కు మాత్ర‌మే వినియోగిస్తారు. అది కూడా త‌నిఖీలు నిర్వ‌హించిన త‌ర్వాతే. ఇక‌..డేరాబాబా ఉన్న జైల్లో వార్తా ప‌త్రిక‌లు.. టీవీ ఉన్న‌ప్ప‌టికీ.. వాటిని చూసేందుకు  అనుమ‌తించ‌టం లేదు.  భ‌ద్ర‌తా కార‌ణాల వ‌ల్ల ఫోన్ కాల్స్‌కు కూడా అనుమ‌తించ‌టం లేద‌న్నారు.

గుర్మీత్‌ను ఏకాంతంగా ఉంచార‌న్న వాద‌న‌లో నిజం లేద‌ని చెప్పారు. ఆయ‌న్ను మ‌రో ముగ్గురు జీవిత ఖైదీల‌తో క‌లిపి ఉంచిన‌ట్లు పేర్కొన్నారు. అన్నింటికి మించి జైలు సిబ్బందిలో ఏ మ‌హిళ‌ను గుర్మీత్‌కు ద‌రిదాపుల్లోకి వెళ్లే అవ‌కాశం లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల గుర్మీత్ లాయ‌ర్ ఆయ‌న‌కునిత్య‌వ‌స‌రాల కోసం రూ.5వేల అకౌంట్ ట్రాన్స్ ఫ‌ర్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. డేరా బాబాకు ద‌త్త‌కూతురుగా చెప్పే హ‌నీప్రీత్‌ను క‌ల‌వాల‌ని.. ఆమెతో మాట్లాడాల‌ని కోరిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. ఆయ‌న ఇచ్చిన ప‌దిమంది జాబితాలో జైలుసిబ్బంది ఆమె త‌ల్లిని క‌లిసేందుకు మాత్ర‌మే అనుమ‌తించారు.వేలాది కోట్ల‌ను ఆర్జించిన బాబా ద‌గ్గ‌ర ప్ర‌స్తుతం రెండు పుస్త‌కాలు.. రెండు జ‌త‌ల చెప్పులు.. ధ‌రించిన ద‌స్తులు మాత్ర‌మే ఉన్నాయ‌ట‌.

మ‌రోవైపు.. హ‌నీప్రీత్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గ‌త వారం ఆమె నేపాల్ లోని మ‌హేంద్ర‌న‌గ‌ర్ లో ఉన్న‌ట్లుగా గుర్తించారు.భార‌త స‌రిహ‌ద్దుల‌కు కేవ‌లం ఐదు కిలోమీట‌ర్ల దూరంలో ఆమె ఉన్న‌ట్లుగా గుర్తించారు. నేపాల్ రిజిస్ట్రేష‌న్ ఉన్న వాహ‌నంలో మ‌రో ముగ్గురితో క‌లిసి హ‌నీప్రీత్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. త‌న‌ను గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేందుకు మారు వేషంలో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఆమెను అదుపులోకి తీసుకోవ‌టానికి హ‌ర్యానా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా.. ప్ర‌యోజ‌నం ఉండ‌టం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు