భారతమ్మా... నిజాలు రాయమ్మా..

భారతమ్మా... నిజాలు రాయమ్మా..

జగన్‌ను చాలా అక్రమంగా అరెస్టు చేశారని, సిబిఐ వాళ్ళు కావాలనే వేదిస్తున్నారని, కాంగ్రెస్‌-టిడిపిలు కుట్రపన్ని జగన్‌ సంస్థలను ఇరికించాయని జగన్‌ భార్య వైఎస్‌ భారతి ప్రధాని మన్మోహన్‌కు ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇక ఈ లేఖలో ఈనాడు పేపరును, చంద్రబాబును, కాంగ్రెసు లీడర్లను, సిబిఐ జెడి లక్ష్మీనారాయణను ఏకిపాడేశారు భారతి.

కాని వీటిలో ఒక్కట కూడా నిజంలాగా అనిపించడంలేదు. అసలు జగన్‌కు ప్రభుత్వానికి సంబంధం ఏమిటి, అతను అధికారి కాదు, అధికారంలో ఉన్న రాజకీయనాయకుడు కాదు, అతను ఎలా ఇన్ని ఆర్ధిక నేరాలకు పాల్పడతాడు అంటూ జగన్‌ భార్య క్వశ్చెన్‌ చేశారు. కాని అవినీతికి పాల్పడ్డానికి, అధికారంలో ఉండటానికి, సంబంధం లేదనే విషయం ఆమె మర్చిపోయినట్టున్నారు.

పైగా ప్రభుత్వం దగ్గర మేలు పొందిన వ్యాపారవేత్తలు, పరిశ్రమదారులు, కంపెనీలు కేవలం జగన్‌ కంపెనీల్లోనే ఎందుకు పెట్టుబడి పెట్టారో ఆమె చెప్పకపోవడం ఇంకా విడ్డూరం. ఏకంగా సుప్రీం కోర్టే సిబిఐ చూపించిన ఆధారలను నమ్మిన తరువాత కూడా, భారతి వాటిని నమ్మకపోవడం మనకు నమ్మశక్యంగా లేదు. భారతమ్మా, నీ లేఖల్లో నిజాలు రాయమ్మా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English