తెలుగు రాష్ట్రాల్లో డేరా బాబాలు...?

తెలుగు రాష్ట్రాల్లో డేరా బాబాలు...?

కోర్టు పుణ్యమా అని గుర్మిత్ సింగ్  ఏ ముహుర్తానా జైలుకెళ్లాడో కానీ అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోను డేరాబాబాల ట్రెండ్ మొదలయ్యింది.  తెల్లారి లేస్తే చాలు... ప్రత్యర్థి పార్టీని ఎలా విమర్శించాలా అని తెగ ఆలోచించే టీడీపీ-వైసీపీలు ఇప్పుడు గుర్మిత్ ట్రెండ్ సెట్  చేశాయి. ఆ బాబా ఇలా  జైలుకెళ్లాడో లేదో.... వెంటనే టీడీపీ డేరా పల్లవి అందుకుంది. సాక్షాత్తు ఆ పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడే ....అక్కడ డేరా బాబా ఇక్కడ జగన్ బాబా అని  స్టార్ట్ చేశారు.

ఇక అక్కడ నుంచి ఏపీలో ఇదో ట్రెండ్ అయిపోయింది. రోజు  రోజుగా డేరా బాబా కథలు బయట పడే కొద్దీ రెండు పార్టీ నేతలు మీరే డేరా బాబాలు అంటే మీరే డేరా బాబాలు అంటూ విమర్శించుకోవడం మొదలెట్టారు. చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేశారో లేదో... వెంటనే వైసీపీ రివర్స్ కౌంటర్ వేసింది. అసలు ఆ డేరాబాబాకి గురువు చంద్రబాబేనంటూ వైసీపీ నేత కొడాలి నాని ఎదురు దాడి చేసారు. పది రోజుల నుంచి గుర్మిత్ జైలు కెళ్లిన తర్వాత మీడియా ఆయన గురించి ఇప్పుడిప్పుడే మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నా సరే.. మన పార్టీ నేతలు మాత్రం మర్చిపోవడం లేదు.

తాజాగా ఇంటింటికీ తెలుగు దేశం అంటూ ఆ పార్టీ నేతలు జనాల్ని కలుసుకోవడానికి రెడీ అయితే వెంటనే వైసీపీ ఇంటింటికీ డేరాబాబాలొస్తున్నారు జాగ్రత్త అంటూ జనాల్ని హెచ్చరిస్తోంది.
   
నిజానికి విమర్శలకు డేరాబాబాని వాడుకోవడం వరకు బాగానే ఉంది. కానీ డేరాబాబా ఎలాంటి వాడో.. ఆయనగారి లీలలేంటో ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఏ పార్టీకి చెందిన నేతైనా జనాల్లో కాస్తో కూస్తో గౌరవం ఉండేది. ఎంత దిగజారినా డేరాబాబా రేంజ్ లో మాత్రం ఉంటారని జనం అనుకోలేదు. కానీ ఇప్పుడు ఇలా నేతలు ఒకర్నొకరు మీరే డేరా బాబాలు మీరే డేరా బాబాలు అంటే... ఓటర్లకు లేని పోని కొత్త డౌట్లు పుట్టుకొస్తాయి.

ఇప్పటి వరకు అవినీతికి పాల్పడుతున్నారనే అనుకుంటున్నారు. కానీ ఇలా ప్రతి విషయానికి డేరా బాబాతో నేతలు పోల్చుకుంటు వస్తే... మన వాళ్ల గురించి ఇంకా చాలా చాలా అనుకోవాల్సి వస్తుంది. సో... ఇకనైనా ఈ డేరా ట్రెండ్ కి నేతలు ఫుల్ స్టాప్ పెడితే మంచిది. లేదంటే ఉన్న పరువు కూడా బజార్న పడుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు