రాములమ్మా నోరు విప్పాల్సిందే

రాములమ్మా నోరు విప్పాల్సిందే

గులాబీ దళం నుండి బహిష్కరించబడిన నేత రఘునందనరావు, పార్టీలో పెద్ద చిచ్చే పెట్టాడు. ఒకటికాదు రెండు కాదు, మనోడు చేసిన ఆరోపణాలు టిఆర్‌ఎస్‌ నేతలకు చెమట్లు పట్టిస్తున్నాయి. ఏకంగా సిడిలను బయటపెడతానని రఘునందన్‌ చెబుతుంటే, టిఆర్‌ఎస్‌ వర్గాలకు ఏం చేయాలో కూడా పాల్పోవడంలేదు.

ఏకంగా పద్మాలయా స్టూడియో విషయంలో నటి విజయశాంతి ఇంట్లో ఆమె భర్త చేతులమీదుగా సెటిల్‌మెంట్‌ జరిగిందని చెబుతున్నారంటే, జనాలకు సందేహం రాకుండా ఉండదు. అయితే రఘు ఆరోపణనలను ఇటు హరీశ్‌ రావు, అటు కెటిఆర్‌, కవితలు బాగానే తిప్పికొట్టారు. పరువు నష్టం దావా వేస్తామని వార్నింగులు ఇచ్చేశారు కెసిఆర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌.

ఇంత జరిగినా కూడా రాములమ్మ విజయశాంతి మాత్రం  నోరు విప్పకపోవడం గమనార్హం. నిజంగానే ఆమె ఇంట్లో సెటిల్‌మెంట్‌ జరిగిందా, దానికి సంబంధించిన ఆధారాలు రఘునందన్‌ దగ్గర ఉండటం వలనే విజయశాంతి సైలెంట్‌గా ఉంటున్నారా అనే సందేహం వస్తోంది. మరి రాములమ్మా నోరు విప్పితే కాని అన్నీ సెటిలవ్వవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English