అది తప్ప అన్నీ చేస్తున్న రాహుల్...!

అది తప్ప అన్నీ చేస్తున్న రాహుల్...!

చెయ్యాల్సిన పని తప్ప అన్నీ చేస్తున్నారా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. బీజేపీ దెబ్బకు కకావికలమైపోతున్న కాంగ్రెస్ పార్టీని ఎలా గాడిన పెట్టాలా అన్న సంగతి గాలికొదిలేసి... దేశాలు పట్టుకు తిరుగుతున్నారు ఈ చిన్న రాజా వారు. ఓ వైపు కాబోయే ప్రధాని అని కాంగ్రెస్ నేతలంతా అనుకుంటూ ఉంటే పాలిటిక్స్ లో వరుస దెబ్బలు తట్టుకోలేకపోతున్నారో ఏమో రాహుల్ మాత్రం రాజకీయాలు తప్ప అన్నీ చేస్తున్నారు. 

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ముందున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి ఎంతో కొంత ఉత్సాహం రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెల్చి తీరాలి.  హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సీఎం వీరభద్ర సింగ్ కి ఇప్పటికే యాంటి ఇన్కంబయన్సీ  మెడ మీద కత్తిలా వేలాడుతోంది.

ఇక గుజరాత్ లో బలమైన నేతగా పేరున్న శంకర్ సింఘ్ వాఘేలా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పీన తర్వాత మళ్లీ అంత బలమైన నేత పార్టీలో కనిపించడం లేదు.  నేతలంతా పార్టీ పరిస్థితిపై మదనపడుతుంటే .. అయ్యగారు మాత్రం సిలికాన్ వ్యాలీకెళ్లి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పై ఉపన్యాసాలిస్తారట. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అంటే హ్యూమన్ రోబోలు.

బహుశా తన వల్ల కాని పని హ్యూమన్ రోబోలైనా చేస్తాయనుకుంటున్నారో ఏమో రాహుల్. ఓ వైపు తమ యువరాజు ఘనతను పార్టీ నేతలు బయటకు పొగుడుతున్నా... లోలోపల మాత్రం చెయ్యాల్సిన పని తప్ప అన్నీ చేస్తున్నారని తెగ ఫీలైపోతున్నారట. నేతల బాధ రాహుల్ కి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో...?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు