గాలికి సుప్రీం క‌ళ్లెం

గాలికి సుప్రీం క‌ళ్లెం

అక్ర‌మాస్తుల కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన సొంత వూరు బళ్లారికి వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అతని వినతిని తోసిపుచ్చింది. ఆయనను భళ్లారికి వెళ్లనిస్తే సాక్ష్యాలను నాశనం చేయడం, లేదా తారుమారు చేసే అవకాశం ఉందన్ని సీబీఐ న్యాయవాదుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.

జైలు నుంచి బెయిల్ పై విడుదలైన గాలి జనార్థనరెడ్డి తన కుమార్తె వివాహం సందర్భంగా సొంత ఊరు వెళ్ళాడు. అ త‌రువాత నుండి ఆయ‌న బెంగుళూరులోనే ఉంటున్నారు. ఆయ‌న జైలులో ఉన్న‌ప్పుడు బెయిలు కోస‌మే ఏసీబీ న్యాయ‌మూర్తికి లంచం ఎర‌జూపి కేసులో ఇరుక్కున్నాడు. ఆ త‌రువాత చాలారోజులు బెయిలు రాక జైలులోనే ఉండిపోయాడు. ఆ త‌రువాత నానాతంటాలు ప‌డి బెయిలు తెచ్చుకున్నాడు.

కేంద్రంలో బీజేపీ భాగ‌స్వామ్యంలోని ఎన్డీఎ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో త‌న కేసుల‌కు విముక్తి ల‌భిస్తుంద‌ని గాలి భావించాడు. కానీ ఆయ‌న అనుకున్నంత స‌హ‌కారం కేంద్రం నుండి, బీజేపీ అధిష్టానం నుండి ల‌భించ‌డం లేదు. ఈ మ‌ధ్య ఆయ‌న బీజేపీ అధిష్టానంతో స‌న్నిహిత సంబంధాలు నెర‌పుతున్న‌ట్లు తెలుస్తుంది. అవి ఎంత‌వ‌ర‌కు ఈయ‌న‌కు సాయ ప‌డ‌తాయో వేచిచూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English