డేరాబాబా...జైల్లో కూడా సంపాదించేస్తున్నాడు

డేరాబాబా...జైల్లో కూడా సంపాదించేస్తున్నాడు

డేరా స‌చ్చ సౌదా అధినేత  గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలియ‌స్ డేరా బాబా కొత్త జీవితం ఒకింత ఆస‌క్తిక‌రంగానే సాగుతోంద‌ని అటున్నారు. సరిగ్గా వారం కిందట సిర్సాలోని 700 ఎకరాల డేరా కేంద్ర కార్యాలయం నుంచి ఊరేగింపుగా బయటకు వచ్చిన గుర్మీత్ రామ్ రహీం సింగ్.. ప్రస్తుతం రోహ్‌తక్‌లోని సునరియా జైలులో రోజుకు రూ.40 కూలికి తోటపని చేస్తున్నాడు. డేరా సచ్చా సౌదాలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన గుర్మీత్.. జైలు క్యాంటీన్ నుంచి మినరల్ వాటర్ తెప్పించుకొని తాగుతున్నాడు. సిర్సా డేరాలోని అత్యంత ఖరీదైన పరుపులపై పడుకున్న బాబా.. ఇప్పుడు తనకు కేటాయించిన జైలు గదిలోని గోడలతో మాట్లాడుతూ సమయం గడుపుతున్నారు.

శనివారానికి వారంరోజుల జైలుశిక్షను పూర్తి చేసుకున్న గుర్మీత్ జైలు జీవితం అనూహ్య‌మైన రీతిలో ముందుకు సాగుతోంద‌ని అంటున్నారు. ఖైదీగా ఉన్న డేరా బాబాకు రెండు బ్లాంకెట్లు, పరుపును అందించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. మొదటి, రెండో రోజు భోజనం బాగాలేదని ఫిర్యాదు చేసిన గుర్మీత్ అనంత‌రం అది కూడా మానేసిన‌ట్లు స‌మాచారం. తన సహాయకులతో సైతం మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. తనకు గుండెలో నొప్పిగా ఉంటుందని, బీపీతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని జైలు అధికారులకు తెలిపాడు. ఆయనకు రోజు పండ్లు, జైలు భోజనం, మినరల్ వాటర్ ఇస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం జైలు సూపరింటెండెంట్ పిలిచినప్పుడు హాజరు పలుకుతున్నాడు.

ఇదిలాఉండ‌గా...గుర్మీత్ రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వీటి విచారణ చివరి దశలో ఉంది. ఇవేకాకుండా తన అనుచరుల వృషణాలను తొలగిస్తున్నాడనే అభియోగాన్ని సీబీఐ మోపింది.  దీనిపై సైతం ద‌ర్యాప్తు సాగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు