హ‌నీని బంధువులు ఛీ కొడుతున్నార‌ట‌

హ‌నీని బంధువులు ఛీ కొడుతున్నార‌ట‌

త‌న ద‌గ్గ‌ర సాధ్విలుగా ఉండే ఇద్ద‌రిపై అత్యాచారం చేసిన‌ ఆరోప‌ణ‌లు నిరూపిత‌మై.. దోషిగా 20 ఏళ్లు జైలుశిక్ష‌కు గురైన డేరా బాబా పేరు చెప్పిన వెంట‌నే.. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితురాలు హ‌నీ ప్రీత్ అలియాస్ ప్రియాంక త‌నేజా గుర్తుకు రావ‌టం ఖాయం.

బాబాను ఒక్క క్ష‌ణం కూడా విడిచి పెట్ట‌కుండా ఉండే ఆమెకు డేరా గుర్మీత్ కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చేవారు. ఏ ఫంక్ష‌న్‌కు వెళ్లినా.. ఆమె ప‌క్క‌నే ఉంటేవారు. అంతేనా.. త‌న సినిమాల్లోనూ హ‌నీకి ప్ర‌త్యేక పాత్ర‌లు ఇచ్చేవారు. గుర్మీత్ కు తోడుగా ఉంటూ.. ఆయ‌న‌కు సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాలు చూస్తార‌న్న పేరున్న ఆమె తీరుపై ఇటీవ‌ల కాలంలో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి.

గుర్మీత్‌కు ద‌త్త‌ పుత్రిక అని చెబుతున్నా.. అందులో ఎలాంటి నిజం లేద‌ని.. అదంతా ఉత్త మాటేన‌ని బాబాకు స‌న్నిహితంగా ప‌ని చేసిన వారు ఆరోపించారు. అంతేనా.. గుర్మిత్ చేతిలో అత్యాచారానికి గురైన వారు సైతం హ‌నీకి  బాబాకు మ‌ధ్య ఉన్న బంధంపై సందేహాలు వ్య‌క్తం చేయ‌టం మ‌ర్చిపోకూడ‌దు.

అత్యాచారకేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న గుర్మిత్‌.. త‌న‌తో పాటు హ‌నీని జైల్లో ఉంచాల‌ని.. త‌న స‌ప‌ర్య‌ల‌కు ఆమె అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. అయితే.. ఇందుకు నిబంధ‌న‌లు అంగీక‌రించ‌వ‌ని అనుమ‌తులు నిరాక‌రించారు. గుర్మీత్‌కు ఇంత క్లోజ్ అయిన హ‌నీని ఆమె బంధువులు ప‌క్క‌న పెట్టేశార‌ట‌. కోట్లాదిమంది దైవంగా అభివ‌ర్ణించే డేరా బాబా ఆశ్ర‌మంలో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌ప్ప‌టికీ.. ఆమెతో బంధురికాన్ని ఆమె ఇద్ద‌రు మామ‌లు తుంచేసుకోవ‌టం ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్పాలి.

సిర్సాలో ఉండే వీరు.. పెద్ద వ్యాపారాలు చేస్తుంటారు. త‌మ మ‌ధ్య రాక‌పోక‌ల్ని కూడా క‌ట్ చేసిన‌ట్లుగా వారు చెబుతారు. ఇక‌.. హ‌నీ త‌ల్లిదండ్రులు మాత్రం డేరా బాబా ఆశ్ర‌మంలో ఉండేవారు. హ‌నీప్రీత్ క్యారెక్ట‌ర్‌ను అంద‌రూ వేలెత్తి చూపించేవార‌ని.. దీంతో ఆమెతో సంబంధాలు తాము తెంచుకున్న‌ట్లుగా చెబుతారు. హ‌నీతో త‌మ‌కు ఏ మాత్రం సంబంధం లేద‌ని వారు చెప్పారు. బంధువులు కూడా హ‌నీని ప‌క్క‌న పెట్టేయ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English