టీఆర్ఎస్ పార్టీ బ్లైండ్ గేమ్ !

 టీఆర్ఎస్ పార్టీ బ్లైండ్ గేమ్ !

టీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పోక‌డల మీద ఆ పార్టీలో చేరిన వారు ఆవేద‌న చెందుతున్నారు. ఎలా భ‌య‌ట‌ప‌డ‌దామా ఆందోళ‌న చెందుతున్నారు. వాళ్లంతా మాతో ఇప్పుడు ట‌చ్ లో ఉన్నారు. ఆట మీరు మొద‌లుపెట్టారు .. దానిని మేం ముగిస్తాం అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు మైండ్‌ గేమ్‌ ఆడాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ పార్టీనే బ్లైండ్ గేమ్ ఆడుతుంద‌ని అన్నారు.

కాంగ్రెస్ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క టీఆర్ఎస్ పార్టీలోని ముగ్గురు ఎంపీలు, 15 మంది మంది ఎమ్మెల్యేలు, ఏడెనిమిది మంది మంత్రులు త‌మ‌తో ట‌చ్ లో ఉన్నార‌ని చేసిన వ్యాఖ్య‌లు క‌లక‌లం రేపుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నేత‌లు కాంగ్రెస్ వ్యాఖ్య‌లను ఎద్దేవా చేస్తున్నారు. మునిగిపోయే కాంగ్రెస్ ప‌డ‌వను ఎక్కేందుకు ఎవ‌రూ సిద్దంగా లేర‌ని అన్న నేప‌థ్యంలో పార్టీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స్పందించారు.

తర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఫౌల్‌ గేమ్‌ను టీఆర్‌ఎస్‌ మొదలు పెట్టిందని, ఆ పార్టీ నాయ‌క‌త్వం మీద అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు త‌మ దిక్కు చూస్తున్న‌ది వాస్త‌వం అని, కేసీఆర్ చేయిస్తున్న స‌ర్వేలు పెద్ద బూమ‌రాంగ్ అని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. రియ‌ల్ గేమ్ త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంద‌ని, టీఆర్ఎస్ పంజ‌రంలో చిక్కిన చిలుక‌లు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు