బాలయ్య ప్రశ్న: అమితాబ్ ఏం పీకాడు?

బాలయ్య ప్రశ్న: అమితాబ్ ఏం పీకాడు?

నందమూరి బాలకృష్ణ సినీ నటుల రాజకీయ ప్రస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిల గాలి తీసేసేలా మాట్లాడాడు బాలయ్య. ‘పైసా వసూల్’ ప్రమోషన్లలో భాగంగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య వీళ్లిద్దరినీ టార్గెట్ చేసుకున్నాడు.

సినిమా వాళ్లు మరింతమంది రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తారా అని బాలయ్యను అడిగితే.. ‘లేదు. నేనెవరినీ రాజకీయాల్లోకి రమ్మని పిలవను.ఎందుకంటే రాజకీయాలంటే ఎదగడం.. ఎమోషన్ కాదు. ఎమోషన్ తో రాజకీయాల్లోకి వచ్చి రాణించడం ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైంది. అమితాబ్ బచ్చన్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఏం పీకాడు? బహుగుణ లాంటి ఒక గొప్ప గొప్ప రాజకీయ నాయకుడిని ఓడించడం తప్ప. ఆయన పార్లమెంటుకు వెళ్లి ఆటోగ్రాఫులు ఇవ్వడం.. ఫొటోలు దిగడం తప్ప ఏం చేసింది లేదు. బహుగుణ గారు ఉండుంటే ప్రజలకు మరింత మంచి చేసేవారేమో. చిరంజీవి వచ్చాడు ఏమైంది? సినిమా వాళ్లు ఇక్కడ నిలవడం సాధ్యం కాదు. వాళ్లు ఇక్కడ షైన్ అవ్వలేరు. అది నేను రాసిస్తాను. మా సంగతి వేరు. మా బ్లడ్ వేరు. మా బ్రీడ్ వేరు’’ అని బాలయ్య అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు