దోమను చంపినందుకు ట్విట్ట‌ర్ అకౌంట్ బ్లాక్

దోమను చంపినందుకు ట్విట్ట‌ర్ అకౌంట్ బ్లాక్

షాకులందు వింత షాకులు వేర‌యా అన్న‌ట్లు..అలా వ‌చ్చిన ఓ షాకింగ్ వింత‌తో ఇదెక్క‌డి విడ్డూరంరా బాబు.. అంటూ మ‌నోడు నెత్తి గోక్కుంటున్నాడు. ఎందుకంటే.. ఓ దోమ‌ను చంపిన పాపానికి మ‌నోడి ట్విట్ట‌ర్ అకౌంట్ బ్లాక్ అయింది. వివ‌రాల్లోకెళ్తే.. ఆగ‌స్టు 20న జ‌పాన్‌కు చెందిన‌ ఓ వ్య‌క్తి టీవీ చూస్తుండ‌గా.. ఓ దోమ మ‌నోడిని కుట్ట‌డానికి ట్రై చేసింద‌ట‌. వెంట‌నే దాన్ని చేతితో కొట్టి చంపేసి దాని ఫోటో తీసి "న‌న్ను డిస్ట‌ర్బ్ చేస్తున్న దోమ‌ను చంపేశా`` అంటూ త‌న‌ ట్విట్ట‌ర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.

ఇది జ‌రిగిన వెంట‌నే ట్విట్ట‌ర్ సంస్థ‌ అత‌డి అకౌంట్ ను స‌స్పెండ్ చేసేసింది! ఇదేమి క‌థ‌రా బాబోయ్ అని మ‌రో అకౌంట్ ట్విట్ట‌ర్ లోనే క్రియేట్ చేసి త‌న బాధ‌ను మ‌ళ్లీ ట్వీట్ల రూపంలో వెళ్ల‌గ‌క్కాడు. అంతే ఇక‌.. మ‌నోడి ట్వీటు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌యింది. ఈ విష‌యం ట్విట్ట‌ర్ కు కూడా తెలియ‌డంతో.. ఆ అకౌంట్ బ్యాన్ కావ‌డానికి కార‌ణాలను కూడా వెల్ల‌డించింది.
ట్విట్ట‌ర్ లో కొత్తగా వ‌చ్చిన ఆల్గారిథ‌మ్స్.. ట్వీట్లలో ఏదైనా వ‌ల్గ‌ర్, అబ్యూసివ్ కీవ‌ర్డ్స్ వాడితే అకౌంట్ ను బ్లాక్ చేసేస్తుంద‌ని వివ‌రించింద‌ట‌. అలా చేసిన ప‌నివ‌ల్ల మ‌నోడి అకౌంట్ బ్లాక్ అయిపోయిందన్న మాట‌. వామ్మో.. ఒక్క ట్వీటు ఎంత ప‌ని చేసిందో క‌దా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు