గుర్మీత్ స్కెచ్ భ‌గ్నం చేశార‌ట‌

గుర్మీత్ స్కెచ్ భ‌గ్నం చేశార‌ట‌

ఇద్దరు మ‌హిళ‌ల మీద అత్యాచారాల కేసులో కోర్టుకు హాజ‌ర‌యిన డేరా స‌చ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం ర‌హీం సింగ్ తీర్పు త‌న‌కు వ్య‌తిరేకంగా వ‌స్తే పోలీసుల మీద దాడి చేసి పారిపోయిందుకే అనుచ‌రుల‌తో క‌లిసి భారీ స్కెచ్ వేసుకుని వ‌చ్చాడ‌ట‌. అయితే కాస్త ముందుగా పోలీసులు దీనిని ప‌సిగ‌ట్టి భారీగా మోహ‌రించి ఈ కుట్ర‌ను భ‌గ్నం చేశార‌ట‌. అయితే గుర్మీత్ ను త‌ప్పించేందుకే ప్ర‌య‌త్నించిన ఏడుగురు ప్ర‌ధాన నిందితుల‌లో ఐదుగురు హ‌ర్యానా పోలీసు శాఖ‌కు చెందిన వారు కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది.

లైంగిక దాడుల కేసులో గుర్మీత్ కు కోర్టు 20 ఏండ్ల శిక్ష విధించింది. అంత‌కుముందు కోర్టుకు భారీగా అనుచ‌రుల‌తో గుర్మీత్ కోర్టుకు హాజ‌ర‌య్యాడు. కోర్టు అత‌నిని దోషిగా నిర్దారించింది. తీర్పు వ్య‌తిరేకంగా వ‌స్తే త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నించారు. పోలీసులు తాజాగా ఈ కుట్ర మీద కేసు న‌మోదు చేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

కోర్టు గుర్మీత్ ను దోషిగా నిర్దారించిన వెంట‌నే పోలీసులు ఆయ‌న‌ను స్కార్పియో కారులో ఎక్కించి .. ఇరువైపులా మోహ‌రించి జైలుకు బ‌య‌లుదేరారు. అయితే కారు కోర్టులో బ‌య‌లుదేర‌గానే గుర్మీత్ అనుచ‌రులు తెల్లని ఇండీవ‌ర్ కారు అడ్డు పెట్టి గుర్మీత్ ను అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌మాదం గ‌మ‌నించిన పోలీసులు మ‌రింత మంది మోహ‌రించి డేరా గార్డుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

గుర్మీత్ ను విడ‌వ‌కుంటే పోలీసుల మీద‌కు వాహ‌నం ఎక్కించాల‌ని డ్రైవ‌ర్ కు చెప్పారట‌. కోర్టు త‌న‌ను దోషిగా తేల్చ‌గానే ఎర్ర బ్యాగ్ అని సంకేతాలు ఇచ్చాడ‌ట గుర్మీత్. అంటే త‌ప్పించ‌మ‌ని సూచ‌నగా తెలుస్తుంది. డేరా గార్డుల వ‌ద్ద ఆటోమేటిక్ తుపాకులు కూడా ఉన్నాయ‌ని హ‌ర్యానా పోలీసు అధికారులు వెల్ల‌డించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు