పెళ్లిరోజున జ‌గ‌న్‌కు నంద్యాల షాక్

పెళ్లిరోజున జ‌గ‌న్‌కు నంద్యాల షాక్

నువ్వా నేనా అన్న‌ట్లుగా త‌ల‌ప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌ల ఫ‌లితం ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ గా మారింది. ఊహించ‌నిరీతిలో నంద్యాల ఓట‌ర్లు ఇచ్చిన షాక్‌ ఆ పార్టీ అధినేత‌తో స‌హా పార్టీ నేత‌లు ఎవ‌రికీ మింగుడుప‌డ‌ని రీతిలో మారింది.

ఉప ఎన్నిక‌ల్లో గెలుపుపై ధీమా వ్య‌క్తం చేసిన విప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పూర్తి కాన్ఫిడెన్స్ లో ఉన్న‌ట్లు చెబుతారు. ఈ రోజు ఉద‌యం హైద‌రాబాద్ లోని త‌న నివాస‌మైన లోట‌స్ పాండ్ లో ఉండి మ‌రీ టీవీల్లో వ‌స్తున్న ఎన్నిక‌ల ఫ‌లితాల్ని ఆయ‌న ద‌గ్గ‌ర ఉంచి చూశారు. మొద‌టి రౌండ్ నుంచి వ‌స్తున్న ప్ర‌తికూల ఫ‌లితంపై ఆయ‌న తీవ్ర అసంతృప్తి చేసిన‌ట్లుగా స‌మాచారం.

ఇదిలా ఉంటే జ‌గ‌న్..భార‌తిల పెళ్లి రోజు ఇవాళే కావ‌టాన్ని పార్టీ నేత‌లు ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. పెళ్లి రోజున ఇలాంటి ఫ‌లితం వెలువ‌డ‌టంతో జ‌గ‌న్ తీవ్ర నిరాశ‌.. నిస్పృహ‌లో మునిగిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. నంద్యాల గెలుపుతో మ్యారేజ్ డేను మ‌రింత ఘ‌నంగా జ‌రుపుకోవాల‌ని భావించిన జ‌గ‌న్‌కు.. ఆయ‌న స‌న్నిహితుల‌కు తాజాగా వెలువ‌డిన ఫ‌లితంతో నోట మాట రాలేద‌ని చెబుతున్నారు.

ప్ర‌తి ఏటా పెళ్లి రోజును స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రుపుకునే జ‌గ‌న్‌.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా మౌనంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. పెళ్లిరోజు వేడుక‌ల్ని జ‌రుపుకోవ‌టానికి జ‌గ‌న్ అంత ఆస‌క్తి చూప‌లేద‌న్న మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు