రూ.200 నోటు రాక‌కు ముహుర్తం ఫిక్స్‌

రూ.200 నోటు రాక‌కు ముహుర్తం ఫిక్స్‌

ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన ఏ ప్రధాని తీసుకొని ఆస‌క్తిక‌ర‌నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో మోడీ స‌ర్కారు రూటు స‌ప‌రేటుగా చెప్ప‌క త‌ప్ప‌దు. పాక్‌పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్ మొద‌లు పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ర‌కూ ఆయ‌న చాలానే నిర్ణ‌యాలు తీసుకున్నారు. గ‌డిచిన కొన్నేళ్లుగా కొత్త నోట్ల మీద ఏ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోలేదు.కానీ.. మోడీ స‌ర్కారు మాత్రం వెయ్యి నోటుపై నిషేధం విధించి.. ఆ స్థానంలో రూ.2వేల నోటును తీసుకొచ్చింది.

తాజాగా రూ.200 నోటును తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌ను తెర మీద‌కు తెచ్చింది. కొత్త నోటును య‌ద్ధ‌ప్రాతిప‌దిక‌న తెచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. ఇప్ప‌టికే రూ.200నోట‌కు సంబంధించిన అన‌ధికారిక ఇమేజ్ లు ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. గ‌తంలో రూ.500.. రూ.1000 నోటు ఉండ‌టంతో చిల్ల‌ర స‌మ‌స్య‌ల తలెత్త‌లేదు. కానీ.. వెయ్యి నోటు ర‌ద్దు చేసి రూ.2వేల‌నోటును తీసుకొచ్చిన త‌ర్వాత నోట్ల కొర‌త‌తో పాటు.. చిల్ల‌ర స‌మ‌స్య తీవ్రంగా మారింది. ఈనేప‌థ్యంలో మ‌ధ్యేమార్గంగా రూ.200నోటును తీసుకురావాల‌ని మోడీ స‌ర్కారు డిసైడ్ అయ్యింది.

ఈ కొత్త నోటు అప్పుడు వ‌స్తుంది.. ఇప్పుడు వ‌స్తుంద‌న్న వార్త‌లు ఇప్ప‌టికే వ‌చ్చాయి. తాజాగా మాత్రం కొత్త నోటు రాక‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రూ.200 నోటును ఆగ‌స్టు చివ‌రి వారంలో కానీ.. సెప్టెంబ‌రు మొద‌టివారంలో కానీ వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఇందుకు త‌గిన‌ట్లుగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. కొత్త‌గా విడుద‌ల చేస్తున్న రూ.200 నోటుకు ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చే్స్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు