పోలింగ్ వేళ జ‌గ‌న్‌కు ఈసీ పంచ్‌!

పోలింగ్ వేళ జ‌గ‌న్‌కు ఈసీ పంచ్‌!

కీల‌కంగా మారిన నంద్యాల ఉప ఎన్నిక‌ల ఎపిసోడ్ లో ముఖ్య‌మైన పోలింగ్ ఈ ఉదయం ఏడు గంట‌ల‌కు మొద‌లైంది.  ఇదిలా ఉంటే.. ఇదే స‌మ‌యంలో ఊహించ‌ని ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. ఉప ఎన్నిక ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా ఏపీ విపక్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడ్ని న‌డిరోడ్డు మీద కాల్చి చంపినా త‌ప్పు లేదంటూ తీవ్ర ఆగ్ర‌హంతో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిప‌డింది. ఈ వ్యాఖ్య‌లు ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తాయ‌ని పేర్కొన్న సీఈసీ.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

జ‌గ‌న్ అనుచిత వ్యాఖ్య‌ల‌పై స్పందించిన తెలుగుదేశం నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదును ప‌రిశీలించిన ఎన్నిక‌ల సంఘం జ‌గ‌న్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్ని ప‌లువురు తీవ్రంగా త‌ప్పు ప‌ట్ట‌టం తెలిసిందే. పోలింగ్ జ‌రుగుతున్న వేళ‌.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు త‌ప్ప‌న్న విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం చెప్ప‌టం.. చ‌ర్య‌ల‌కు ఆదేశాలు జారీ చేయ‌టం చూస్తే.. జ‌గ‌న్‌కు కొత్త ఇబ్బందులు ఎదురైన‌ట్లేన‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English