ఆత్మగౌరవ యాత్ర హాయిగా సాగుతోంది

ఆత్మగౌరవ యాత్ర హాయిగా సాగుతోంది

చంద్రబాబు తన మలివిడత ఆత్మగౌరవ యాత్ర శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెట్టాలని నిర్ణయిస్తే ఇది ఎలా సాధ్యం, అక్కడ ఇంతకు ముందే తీవ్ర నిరసనలు ఎదుర్కున్న చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకోవడం తప్పేమో అన్న భావం టిడిపి నేతల్లోనే వ్యక్త మయింది. కాని కాగల కార్యాన్ని గంధర్వులే నెరవేర్చారు అన్నట్టు చంద్రబాబుకు ఆ అవకాశాన్ని అవరోదాలు లేకుండా కల్పించింది తూఫాన్ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంకేముంది పేరు ఆత్మగౌరవం అని పెట్టకుంటే మాత్రం ఏంటి, ఆ పని చేసేసి పలితం పొందితే సరిపోతుంది కదా అనుకున్నాడు చంద్రబాబు, వెంటనే ఆపనిలో తలమునకలయ్యాడు.

పేరుకు తుపాను బాధితుల పరామర్శ అయినా, ఆత్మగౌరవ యాత్ర ఎక్కడ చేయాలనుకున్నాడో అక్కడ తిరుగుతున్నారు. యాత్ర ద్వారా ఏదయితే ప్రజలకు చెప్పాలనుకున్నాడో అది చెప్పేస్తున్నాడు, పైగా సాయం పేరుతో అదనంగా మార్కులు కూడా కొట్టేస్తున్నాడు. కాదా మరి,   చంద్రబాబు రాజకీయం ముందు ఎవరు పనికొస్తారు చెప్పండి, ఎలాంటి దానినైనా తన రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడంలో దిట్ట. ఇటీవల ఉత్తరాఖండ్ విలయం, నేడు సీమాంధ్ర లో తూఫాన్ ప్రళయం, ఏదయితేనేం చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు అన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. గత మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు సీమాంద్రలోని వరద బాదిత ప్రాంతాల వారితోనే గడుపుతున్నారు, తన వంతుగా సహాయం అందిస్తూ, ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ రాత్రి కూడా వారిని వదిలి వెల్లకుండా అక్కడే ఉంటూ మార్కులు కొట్టేస్తున్నారు అన్న భావం రాజకీయుల్లో వ్యక్తమవుతోంది.

అయితే ఆయన ప్రతిపక్షనేతగా తన వారు కష్టాల్లో ఉన్నప్పుడు తాను చేయాల్సిన పనిని చేస్తూ విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్నారు అన్న భావన మాత్రం జనాల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆయన సీమాంద్రలో వరద బాదితుల వద్ద ఉంటే ఇక్కడ హైదరాబాద్ లో జగన్ దిక్కులు పిక్కటిల్లేలా చంద్రబాబు రాష్ట్రాన్ని విడగొడుతూ సీమాంద్రులకు అన్యాయం చేస్తున్నాడు అని అన్నాడు. అయినా అక్కడ సమైక్యవాదుల నుంచి తిరుగుబాటు ఎదురు కాకపోవడమే దీనికి ఉదహరణ అని కూడా అంటున్నారు పలువురు.

అయితే చంద్రబాబు ఒక్క ప్రజలను పలకరించే పనే చేయడం లేదు, పనిలో పనిగా తన పట్టు పెంచుకుంటుండడంతో పాటు, ప్రత్యర్థులను ప్రజల్లో పాతరేసే పనిని హాయిగా చేసుకుంటూ పోతున్నారు. లేటెస్టుగా వరద బాదిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, బాదితులను పరామర్శిస్తూ జాగ్రత్తగా ఉండండి, మీవద్దకు సోనియానే జగన్ ముసుగు వేసుకుని వస్తోంది, మిమ్మలను విడగొట్టాలని చూస్తోంది అంటూ నూరి పోసాడు. మొన్న సమన్యాయం చేసి విడగొట్టుమన్న జగన్ అంతలోనే మీ కోపం చూసి సమైక్యం అంటున్నాడు కదా అని చెపుతున్నాడు, అది నమ్మి మీరు ఆయనను గెలిపిస్తే హోల్ సేల్ గా మీ అందరిని సోనియా చేతిలో పెట్టేస్తాడు,అంటే బాదితుల వద్ద కూడా పనిలో పనిగా జగన్ పై నిందలు వేయడం మానుకోలేదన్న మాట చంద్రబాబు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English