ఎందుకీ కబుర్లు వెంకయ్యా?

ఎందుకీ కబుర్లు వెంకయ్యా?

కేంద్రంలో  వున్న కాంగ్రెస్ పార్టీ అపరిపక్వతతో, అనాగరికంగా విభజన నిర్ణయం తీసకుందట. ఈ మాటలన్నది ఎవరో కాదు. భాజపా సీనియర్ నాయకుడు వెంకయ్యనాయకుడు. మాటలను అటు ఇటు తిప్పి, కర్ర విరగకుండా మాట్లాడడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు తాజాగా  విభజనపై ఆయన వ్యాఖ్యానాలు ఇవి. పైగా కాంగ్రెస్ సీమాంధ్రలో విభజన వ్యతిరేకిస్తోందని, తెలంగాణలో సంబరాలు జరుపుతోందని, భాజపా అలా కాదని ఒకే విధానం అంటూ స్వంత డబ్బా కొట్టారు. అలాంటపుడు తాను కూడా సమైక్యానికి వ్యతిరేకిని, విభజనే మా సిద్ధాంతం, అంతే కాదు సీమాంధ్ర భాజపా నాయకులది అదే విధానం అని కుండబద్దలు కొట్టచ్చుగా. కానీ అలా చేయరు. పోనీ కాంగ్రెస్ అనాకరికంగా విభజన చేస్తోంది కాబట్టి దీనికి భాజపా అంగీకరించదు, అనుకూలంగా ఓట వేయదు, తాము అధికారంలోకి వచ్చాక నాగరికంగా విభజిస్తాం అని క్లారిటీ ఇవ్వచ్చుగా...కానీ అదీ చేయరు. అక్కర్లేని ప్రకటనలు, సన్నాయి నొక్కులు నొక్కమంటే మాత్రం నొక్కుతారు. పైగా కాకినాడ సభతో విభజనకు బీజం వేసిన భాజపాకి ఓటేసి మోడీని ప్రధాన మంత్రిని చేయాలంటారు. చిత్రమేమిటంటే, ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం కూడా విభజనకు వైఎస్ ఆజ్యం పోసాడంటారు కానీ, ఏకంగా తీర్మానం చేసి, ఉద్యమాన్ని తలకెత్తుకున్న భాజపాను పల్లెత్తు మాట అనరు. అది ఆ పార్టీ అదృష్టం.

ఇదిలా వుంటే ఇక్కడ మరో ముచ్చట కూడా వుంది. విభజనపై రాజ్ నాథ్ సింగ్, తాను తప్ప ఎవరు ఏ ప్రకటన ఇచ్చినా విలువ వుండదని, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓ ప్రకటన విడుదలచేసారు. అంటే ఏమిటి అర్థం భాజపా రాష్ట్ర శాఖలో కూడా విభజనపై లుకలుకలు మొదలయ్యాయన్న మాటే కదా. ఇలా ఫత్వా జారీ చేసి, కిషన్ రెడ్డి అందరి గొంతులు నొక్కడం అంటే, అది అనాగరికం కాదా..వెంకయ్యా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు