మిస్టర్‌ క్లీన్‌ చిరంజీవి!

మిస్టర్‌ క్లీన్‌ చిరంజీవి!

2014 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీని గట్టెక్కించేది చిరంజీవేనని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నదని ప్రచారం జరుగుతోన్నది. రాష్ట్రంలో ఓ బలమైన సామాజిక వర్గానికి చిరంజీవిని ప్రతినిథిగా చెప్పవచ్చును. ఆ సామాజిక వర్గాన్ని తమవైపుకు తిప్పుకోవాలంటే చిరంజీవిని ఉన్నత స్థానంలో కాంగ్రెసు పార్టీ నిలబెట్టాల్సిందే.

ఆ ఉన్నత స్థానం సిఎం అభ్యర్థి అని కాంగ్రెసు పార్టీలోని రాష్ట్ర నేతలు కొందరు ఇప్పటికే తమ అభిప్రాయాలు వెల్లడించారు. అయితే చిరంజీవి పెద్ద కుమార్తె ఇంట్లో పెద్దయెత్తున డబ్బు ఐటి అధికారులకు దొరకడం, చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ తన బాడీ గార్డులతో రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు టెకీలను కొట్టించడం వంటివి చిరంజీవికి 'క్లీన్‌' ఇమేజ్‌ లేకుండా చేశాయి.

రాజకీయాల్లో ఉన్నవారంతా క్లీన్‌ ఇమేజ్‌తో ఉన్నారా? అనే ప్రశ్న కూడా తలెత్తవచ్చును. అలా చూస్తే చిరంజీవే ఎంతో కొంత క్లీన్‌గా ఉన్నారనే సమాధానం రావచ్చును. ఏదేమైనా కాంగ్రెసు పార్టీ అనుకుంటే చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దానికి క్లీన్‌ ఇమేజ్‌తో పనే లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English