హాట్ టాపిక్‌: ర‌జ‌నీతో బీజేపీ ఎంపీ భేటీ!

హాట్ టాపిక్‌: ర‌జ‌నీతో బీజేపీ ఎంపీ భేటీ!

జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం త‌మిళ‌నాదు రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ రాజ‌కీయాల్లోకి రాబోతున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ తో నిర్వ‌హించిన ఫొటో షూట్ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్ కూడా తాను రాజ‌కీయాల్లోకి రాబోతున్న‌ట్లు బ‌హిరంగంగా ప్ర‌కటించ‌క‌పోయిన‌ప్ప‌టికీ...సంకేతాలిచ్చారు.

గ‌తంలో ఓసారి ప్ర‌ధాని మోదీతో ర‌జ‌నీ భేటీ అయ్యారు. దీంతో, ఆయ‌న బీజేపీలో చేర‌బోతున్నార‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ సీఎం అభ్య‌ర్థి ర‌జ‌నీనే అని పుకార్లు కూడా వినిపించాయి. ప్ర‌స్తుతం కాలా షూటింగ్ లో బిజీగా ఉన్న ర‌జనీకాంత్ రాజ‌కీయ ప్ర‌వేశం అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. కొంత‌మంది బీజేపీ నేత‌లు ర‌జనీకాంత్ ను క‌ల‌వ‌డంతో మ‌రోసారి ఆ చ‌ర్చ మొద‌లైంది.

చెన్నైలో బీజేపీ తలపెట్టిన ఓ ర్యాలీకి హాజరయ్యేందుకు అక్క‌డికి వచ్చిన పార్టీ నేతలు ప్రత్యేకంగా రజనీ కాంత్ ను క‌లిశారు. బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్, ఆ పార్టీ నేత మురళీ ధర్ రావు రజనీ ఇంటికి వెళ్లి ఆయ‌న‌తో భేటీ అయ్యారు. అయితే, తాము కేవ‌లం వ్య‌క్తిగ‌తంగానే ర‌జ‌నీకాంత్ ను క‌లిశామ‌ని వారు చెబుతున్నారు.

ఈ చర్చల వెనుక ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీ అనంత‌రం ... రజనీ కాంత్ బీజేపీతో జ‌త‌క‌డ‌తార‌న్న ఊహాగానాలకు బలం చేకూరిన‌ట్ల‌యింది. రజనీ, ఆయన భార్య లత తదితరులతో తాను దిగిన ఫోటోలను  పూనమ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. తాను కలుసుకున్న ఆత్మీయుల్లో లతాజీ, రజనీ జంట ఒకటంటూ క్యాప్ష‌న్ పెట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు