పురంధ్రీశ్వరికి పగ్గాలు?

పురంధ్రీశ్వరికి పగ్గాలు?

సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీని మరింతగా దెబ్బ తీయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోందా?  సీమాంధ్ర ముఖ్యమంత్రిగా పురంధ్రీశ్వరిని ప్రొజెక్ట్ చేయడం లేదా, ఎన్నికల దగ్గరలో సిఎమ్ గా ఆమెను నియమించడం ద్వారా, సీమాంధ్రలోని బలమైన కమ్మ వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లు తెలియవచ్చింది.  కాంగ్రెస్ లో మిగిలిన రెడ్డి వర్గం పరోక్షంగా జగన్ కు సాయం చేస్తోందన్న అనుమానం వుంది. చిరంజీవికి సముచిత స్థానం ఇచ్చి కాపు వర్గాన్ని ఆకట్టకున్నారు.

ఇప్పడు పురంధ్రీశ్వరికి సముచిత స్థానం ఇవ్వడం ద్వారా రాయపాటి, లగడపాటి తదితరులు అసంతృప్తిని దూరం చేయచ్చు. పైగా దక్షిణ కోస్తాలో గట్టి పట్టు సాధించవచ్చు. ఇది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనగా వుంది. ఎంత చేసినా రాయలసీమలో జగన్ పార్టీది పై చేయి కాబట్టి, అక్క్డడ వున్న కమ్మ వర్గాన్ని కూడా తమవైపు తిప్పుకుంటే కొంత వరకు ఫలితం వుంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఇక్కడ పాయింట్ వుంది రెడ్డి వర్గాలను ఇబ్బంది పెట్టకుండా ఈ వ్యవహారం నడపాలి. కిరణ్ ను తప్పించడం అన్నది కాంగ్రెస్ అభిమతం కాదు. తనంతట తాను తప్పకోవాలి.

ఒకవేళ బిల్ల సందర్భంగా కిరణ్ తప్పకుంటే కనుక, రాష్ట్రపతి పాలన తప్పించేందుకు పురంధ్రీశ్వరిని రంగంలోకి దింపవచ్చు. అయితే అక్కడ ఎన్నిక అన్నది సమస్య కావచ్చు. ముందుగా బొత్స సత్యనారాయణ ను తప్పించి, ఆ స్థానంలోకి పురంధ్రీశ్వరిని తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా వుందని తెలిసింది. తద్వారా రెడ్డి వర్గం ఆగ్రహానికి గురికాకుండా, పని జరిపించవచ్చు. బొత్స ఎలాగూ సీమాంధ్ర జనం ఆగ్రహానికి గురి అయ్యారు కాబట్టి తప్పించడం సులువు. ఇలా అన్ని రకాలుగా ఆప్షన్లపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. కమ్మ, రెడ్డి, కాపు వర్గాలను ఒక తాటి పైకి తెచ్చి విజయం సాధించాలని చూస్తోంది.  
    

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు