రాష్ట్ర విభజన అసంభవం

రాష్ట్ర విభజన అసంభవం

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నటికీ విడిపోదని చెప్పారు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌. సమైక్యవాదం వినిపిస్తూ తెలంగాణ వాదుల దృష్టిలో 'విలన్‌'గా అభివర్ణింపబడుతున్న లగడపాటి, ఇంకోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏకాభిప్రాయం ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందని, కాని ఏకాభిప్రాయం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని లగడపాటి అభిప్రాయపడ్డారు. ఇది సంచలన వ్యాఖ్య అయినప్పటికీ, చాలా పాత వాదనే. ఏకాభిప్రాయం ద్వారానే తెలంగాణ సాధ్యమనే వాదన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సందర్భాలలో రావడం జరిగింది. కాని ఏకాభిప్రాయం ఎలా సాధ్యవముతుంది? దానికి అవకాశమే లేదు.

కాంగ్రెసు పార్టీలోనే తెలంగాణపై ఏకాభిప్రాయం లేదు. కావున, ఏకాభిప్రాయం అనేది తెలంగాణ అంశాన్ని నానవేయడానికి ఓ 'అవకాశం' అంతే. ఏకాభిప్రాయం వచ్చేదాకా నాన్చివేత ధోరణి అవలంభించడమంటే పూర్తిగా తెలంగాణ అంశాన్ని మరుగున పడేయడమే అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English