కాంగ్రెస్ నాయ‌కుడు కాల్పుల వెనుక‌ డ్ర‌గ్స్ కార‌ణ‌మా?

కాంగ్రెస్ నాయ‌కుడు కాల్పుల వెనుక‌ డ్ర‌గ్స్ కార‌ణ‌మా?

మాజీ మంత్రి ముఖేశ్‌కుమార్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటనకు, డ్రగ్స్‌కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసుకు భయపడి విక్రమ్‌గౌడ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్‌ ఫోన్‌లో డ్రగ్స్‌ సమాచారం ఉంది. వాట్సప్‌ మెసేజ్‌ల్లో డబ్బుల కోసం డిమాండ్లు చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్‌స కేసులో తన పేరు బయటికి వస్తుందని విక్రమ్‌లో భయంతో ఆత్మహత్యాయత్నం చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విక్రమ్‌గౌడ్‌ మొబైల్‌లో 39 వాట్సప్‌ మెసేజ్‌లుంటే అన్నింట్లోనూ డబ్బులు ఇవ్వాలని బాధితులు మెసేజ్‌లు పంపినట్లు తెలుస్తోంది. రూ.15లక్షలు, రూ.20లక్షలు, రూ.35లక్షలు ఇవ్వాలని వాట్సప్‌ మెసేజ్‌లో బాధితులు అడిగినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా...నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి అపోలో ఆస్పత్రికి వ‌ద్ద మీడియాతో మాట్లాడుతూ ప‌లు వివరాలు వెల్లడించారు. `` విక్రమ్‌గౌడ్ ఆలయానికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దంతో పై అంతస్తు నుంచి విక్రమ్ భార్య కిందకు వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న విక్రమ్‌ను ఆస్పత్రికి తరలించింది. విక్రమ్‌గౌడ్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి. విక్రమ్‌గౌడ్ ఇంట్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. కేసు దర్యాప్తు కోసం 10 బృందాలు ఏర్పాటు చేశాం. కేసు విచారణ వేగవంతం చేశాం. విక్రమ్‌గౌడ్ ఆరోగ్యం ప్ర‌స్తుతం నిలకడగానే ఉంది` అని సీపీ వివరించారు.

కాగా, తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి 12:30 గంటల తర్వాత విక్ర‌మ్‌గౌడ్ ఇంటికొచ్చాడు. పూజలో పాల్గొనెందుకు ఉదయం నిద్రలేచాడు. ఇదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండుగుడు కాల్పులు జరిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి ఇంటికొచ్చేటప్పుడు ఎవరితోనో విక్రమ్‌ ఘర్షణ పడ్డట్లు తెలిసింది. వాళ్లే వచ్చి విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. విక్రమ్ గౌడ్ నివాసంలో లైసన్స్ లేని తుపాకిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు తానే కాల్చుకున్నాడా లేక ఎవరైనా కాల్పులు చేసారా అన్న విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు అపోలో ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు