అవినీతి ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌ధాని ప‌ద‌వి ఊడింది

అవినీతి ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌ధాని ప‌ద‌వి ఊడింది

పొరుగుదేశ‌మైన పాకిస్థాన్ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌పై జీవిత‌కాల‌ అన‌ర్హ‌త వేటు వేసింది. ప‌నామా పత్రాల కేసులో సుప్రీంకోర్టులోని ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఇవాళ త‌మ తీర్పు వెలువ‌రించింది. పార్ల‌మెంట్‌ను, కోర్టుల‌ను మోసం చేశార‌ని.. ప్ర‌ధాని పద‌వి ఆయ‌న అర్హులు కార‌ని సుప్రీం స్ప‌ష్టంచేసింది. ధ‌ర్మాస‌నంలోని ఐదుగురు న్యాయ‌మూర్తులూ ఈ విష‌యంలో ఏక‌తాటిపై నిల‌వ‌డం గ‌మనార్హం.

ఇక ఈ కేసులో విచార‌ణ జ‌రిపిన జాయింట్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌.. త‌మ విచార‌ణ ప‌త్రాల‌ను సంబంధిత కోర్టుకు ఆరు వారాల్లోపు పంపాల‌ని ఆదేశించింది. ష‌రీఫ్‌తోపాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై కేసులు న‌మోదు చేయాల‌ని స్ప‌ష్టంచేసింది. 30 రోజుల్లో దీనిపై తుది తీర్పు వెలువ‌రిస్తామ‌ని కోర్టు చెప్పింది. ప‌నామా పేప‌ర్స్ కేసులో ఇప్ప‌టికే ఐస్‌లాండ్ ప్ర‌ధాని కూడా త‌న ప‌ద‌వి కోల్పోయారు. ష‌రీఫ్ ప‌ద‌వి కోల్పోయిన రెండో ప్ర‌ధాని అయ్యారు.

ప‌నామా దేశానికి చెందిన మోజాక్ ఫొన్‌సెకా కంపెనీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక మంది ప్ర‌ముఖుల అక్ర‌మ వ్యాపారాల‌కు సంబంధించిన ర‌హ‌స్యాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీతో పాటు జ‌మాత్ ఐ ఇస్లామీ, వ‌త‌న్ పార్టీ, ఆల్ పాకిస్తానీ ముస్లిమ్ లీగ్ పార్టీలు ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌కు వ్య‌తిరేకంగా కేసు వేశాయి.

న‌వాజ్ ష‌రీఫ్ పిల్ల‌లు మ‌ర్యామ్‌, హ‌స‌న్‌, హుస్సేన్ న‌వాజ్‌ల‌కు విదేశాల్లో కంపెనీలు ఉన్న‌ట్లు ప‌నామా ప‌త్రాల ద్వారా వెల్ల‌డైంది. ష‌రీఫ్ కుటుంబీకుల‌కు విదేశాల్లో మొత్తం ఎనిమిది కంపెనీలు ఉన్న‌ట్లు ఆ లీకేజీ జాబితాలో తెలిసింది. ఈ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ పాక్ ప్ర‌తిప‌క్ష పార్టీలు ష‌రీఫ్ కుటుంబంపై విచార‌ణ‌కు పిటీష‌న్ వేశాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు