రాష్ట్రపతి మాత్రం ఏం చేయగలరు?

రాష్ట్రపతి మాత్రం ఏం చేయగలరు?

టిడిపి బృందం రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించాలంటూ ఇదివరకే గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి, విజ్ఞప్తి చేసింది. ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డితోపాటుగా కన్నా లక్ష్మినారాయణ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటివారిపై అవినీతి ఆరోపణలు రావడాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకు వెళ్ళింది తెలుగుదేశం పార్టీ.

చంద్రబాబు నేతృత్వంలో టిడిపి నేతల బృందం గవర్నర్‌ని కలవగా, ఆయన వారు చెప్పిన మాటలు విని ఊరుకున్నారట. అది టిడిపి బృందానికి కోపం తెప్పించింది. అందుకే, చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి బృందం రాష్ట్రపతిని కలవబోతున్నది.

రాష్ట్రపతికీ కళంకిత మంత్రులపై వచ్చిన ఆరోపణల గురించి వివరించి, వారిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరబోతున్నారు చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి నేతలు. గవర్నర్‌ స్పందించలేదు, రాష్ట్రపతి అయినా స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టిడిపి కోరుతున్నది. టిడిపి కోరిక నెరవేరేనా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English