అలోవెరా ర‌సం తాగి సిట్ విచార‌ణ‌కు వ‌స్తున్నార‌ట‌

అలోవెరా ర‌సం తాగి సిట్ విచార‌ణ‌కు వ‌స్తున్నార‌ట‌

డ్ర‌గ్స్ విచార‌ణ‌కు సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వ‌టం తెలిసిందే. ఇందులో భాగంగా నోటీసులు అందుకున్న వారిలో కొంద‌రు సిట్ అధికారుల ఎదుట హాజ‌రయ్యారు.

అయితే.. విచార‌ణ‌కు హాజ‌రైన సంద‌ర్భంగా ప‌లువురు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఎన్ ఫోర్స్ మెంట్ హెడ్ అకున్ స‌బ‌ర్వాల్ సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌స్తుతం విచార‌ణ‌కు త‌మ ఎదుట‌కు హాజ‌ర‌వుతున్న వారు.. త‌మ ద‌గ్గ‌ర‌కు రావ‌టానికి ముందు అలోవెరా ర‌సం తాగి త‌మ క‌డుపును ఖాళీ చేసుకొని వ‌స్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

అలోవెరా ర‌సం తాగి రావ‌టంతో డ్ర‌గ్స్ అవ‌శేషాల్ని క‌వ‌ర్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ప‌ట్టుబ‌డ‌కుండా ఉండేందుకు ఈ ఎత్తుగ‌డ‌ను వేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో డ్ర‌గ్స్ వినియోగించారా? అన్న విష‌యాన్ని తెలుసుకునేందుకు.. ప‌రీక్షించేందుకు వీలుగా స‌రికొత్త ప‌రిక‌రాల్ని ఢిల్లీ నుంచి తేనున్న‌ట్లుగా అకున్ స‌బ‌ర్వాల్ చెబుతున్నారు. డ్ర‌గ్స్ వినియోగంపై క్రీడాకారుల్ని ప‌రీక్షించే ప‌రిక‌రాలు తెప్పిస్తున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు.

తాము ఉత్తినే నోటీసులు ఇవ్వ‌టం లేద‌ని.. త‌మ వ‌ద్ద ఆధారాలు లేకుండా ఎవ‌రికీ నోటీసులు ఇవ్వ‌టం లేద‌న్న మాట‌ను చెప్ప‌టం ద్వారా.. డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌ల‌పై ప్రాధ‌మిక ఆధారాలు ఉన్న విష‌యాన్ని ఒక‌టికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకునే ఇస్తున్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ముఖులు త‌మ ఎదుట విచార‌ణ‌కు వ‌చ్చే స‌మ‌యానికి అలోవెరా ర‌సాన్ని సేవించి వ‌స్తున్నార‌ని అకున్ స‌బ‌ర్వాల్ స్వ‌యంగా చెప్ప‌టం ఇప్పుడు కొత్త సంచ‌ల‌నంగా మారింది. మ‌రి.. అలోవెరాతో క‌వ‌ర్ చేయాల‌ని చూస్తున్న ప్ర‌ముఖుల గుట్టును స‌బ‌ర్వాల్ విప్పేయ‌టం వెనుక మైండ్ గేమ్ ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

త‌మ త‌ప్పుల్ని క‌వ‌ర్ చేసుకోవ‌టానికి కొత్త ఎత్తులు పాటిస్తూ.. ఆత్మ‌విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న వారికి పంచ్ ఇచ్చేలా స‌బ‌ర్వాల్ మాట‌లు ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సంద‌ర్భంగా అకున్ స‌బ‌ర్వాల్ ప్ర‌స్తావించిన అలోవెరా ముచ్చ‌ట వెనుక మ‌ర్మం వేరే ఉంద‌ని తెలుస్తోంది. అలోవెరాతో త‌మ‌ను క‌వ‌ర్ చేయాల‌ని భావిస్తున్న వైనాన్ని తాము గుర్తించామ‌న్న విష‌యాన్ని విచార‌ణ ఎదుర్కొన్న వారికి తెలియ‌జేసేందుకే ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టార‌ని చెబుతున్నారు. ఏమైనా అలోవెరా ముచ్చ‌ట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు