ఇక‌పై పాస్ పోర్టు పొంద‌డం మ‌రింత సుల‌భం!

ఇక‌పై పాస్ పోర్టు పొంద‌డం మ‌రింత సుల‌భం!

పాస్ పోర్టు పొందాలంటే ఓ మ‌హా య‌జ్ఞం చేసిన‌ట్లే. ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలన్నీ స‌రిపోతేనే పాస్ పోర్టు జారీ చేస్తారు. అందులోనూ డేట్ ఆఫ్ బ‌ర్త్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌ని స‌రిగా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అయితే, పాస్ పోర్టు ద‌ర‌ఖాస్తుదారుల‌కు కేంద్రం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. ఇక‌పై  పాస్‌పోర్టు పొందాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం లేదంటూ ప్ర‌క‌టించింది. 60 ఏళ్లు పైబడిన వారికి, 8ఏళ్ల లోపు చిన్నారులకు పాస్‌పోర్టు రుసుమును 10శాతం తగ్గిస్తున్నట్టు తెలిపింది.

పాస్‌పోర్టు జారీ నిబంధనల్ని మ‌రింత స‌ర‌ళ‌త‌రం చేసే ఉద్దేశంతోనే కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. పాస్‌పోర్టు నిబంధనల చట్టం 1980 ప్రకారం జనవరి 26, 1989 తర్వాత పుట్టిన వారెవరైనా పాస్ పోర్టు పొందాలంటే డేట్ ఆఫ్ బర్త్‌ సర్టిఫికెట్‌లు త‌ప్ప‌నిస‌రిగా సమర్పించాల్సిందే. తాజాగా స‌వ‌రించిన నిబంధ‌న‌ల ప్ర‌కారం, ఇకపై  ఆధార్‌, పాన్‌, జనన తేదీని ధ్రువీకరించే ఇతర పత్రాలు వేటినైనా పాస్‌పోర్టు పొందేందుకు అనుమ‌తిస్తామ‌ని  వెల్లడించింది. పాత నిబంధనల్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్‌ నేత బిశ్వాల్‌ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకె సింగ్‌ ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. ఆధార్‌, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు గుర్తింపు కార్డు, ఎల్‌ఐసీ బాండ్లు ఇలా వీటిలో దేనినైనా పాస్‌పోర్టు పొందేందుకు దాఖ‌లు  చేయొచ్చని స్పష్టంచేశారు. 60 ఏళ్లు పైబడిన వారికి, 8ఏళ్ల లోపు చిన్నారులకు పాస్‌పోర్టు రుసుంను 10శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. సింగిల్‌ పేరెంట్‌ దరఖాస్తుదారులను ప్రోత్సహించేందుకు ఆన్‌లైన్లో తమ తల్లి, లేదా తండ్రి లేదా సంరక్షకుడి పేరును పేర్కొంటే చాలని, తల్లిదండ్రులిద్దరి పేర్లను పేర్కొనాల్సిన అవసరం లేదని తెలిపారు. స‌వ‌రించిన నిబంధ‌న‌ల‌తో మ‌రింత సులువుగా పాస్ పోర్టును పొంద‌వ‌చ్చ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు