ధర్మాన, సబిత రాజీనామా

ధర్మాన, సబిత రాజీనామా

అందరూ అనుకున్నట్టుగానే జరిగింది. ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత, ఉత్కంఠభరిత వాతావరణం నెలకొన్నది కాంగ్రెసు పార్టీలో.

జగన్‌ ఆస్తుల కేసులో నిందితులుగా సీబీఐ పేర్కొన్న సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, వీరితో రాజీనామాలు చేయించాల్సిందిగా ముఖ్యమంత్రిని కాంగ్రెసు అధిష్టానం సూచించినదంట. దాంతో అధిష్టానం ఆదేశాల ప్రకారం, ముఖ్యమంత్రి తన ఇంటికి సబిత, ధర్మానలను పిలిపించుకుని వారితో రాజీనామాలు చేయించినట్లు తెలుస్తున్నది

 మంత్రులిద్దరూ సమర్పించిన రాజీనామా లేఖలను తీసుకుని ముఖ్యమంత్రి రేపు గవర్నర్‌ని కలిసే అవకాశం ఉన్నదని వినికిడి. సిఎం ఇంటికి వ్యక్తిగత వాహనాలలో వెళ్ళిన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీనియర్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే తిరిగి వెళ్ళిపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English