విశాఖ‌కు ప‌వ‌న్‌...ఆ వ‌ర్గాల‌తో ప్ర‌త్యేక భేటీ

విశాఖ‌కు ప‌వ‌న్‌...ఆ వ‌ర్గాల‌తో ప్ర‌త్యేక భేటీ

జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోమారు ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈనెల 30వ తేదీన పవన్‌ కల్యాన్‌ విశాఖలో పర్యటించనున్నారు. కిడ్నీ సంబంధిత వైద్యులు, వైద్య విద్యార్థులు, మీడియా ప్రతినిధులతో ఆయన విశాఖలో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడి ఉత్తరాంధ్ర కార్యకర్తలు సన్నాహాలు మొదలుపెట్టారు. కాగా, ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌పై ప‌లు వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ మొద‌లైంది.

కొద్దికాలం క్రితం ముగిసిన రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ప‌వ‌న్ ఉత్త‌రాంధ్ర‌పై దృష్టి సారించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అందులోనూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో స‌మావేశం ఉంటుంద‌నే వార్త‌లు వెలువ‌డి ఆ భేటీ ర‌ద్ద‌యిన అనంత‌రం జ‌న‌సేనాని ఈ ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. కిడ్నీ బాధితుల‌తో స‌మావేశం అవడాన్ని బ‌ట్టి ఆయ‌న మ‌రోమారు క్రియాశీల ఉద్య‌మాల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారా అనే చ‌ర్చ సాగుతోంది.

ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌కు సంబంధించిన అంశాలు ప‌రిష్కారం కాని నేప‌థ్యంలో ప‌వ‌న్ వారితో స‌మావేశం అవుతుండ‌టం చూస్తుంటే...జ‌న‌సేనాని తిరిగి త‌న పోరాట ఎజెండాను ఎత్తుకోనున్నారా అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు