వెంక‌య్య ఎన్ని ఓట్లు తో గెలుస్తారంటే

వెంక‌య్య ఎన్ని ఓట్లు తో గెలుస్తారంటే

ఉప రాష్ట్రపతిగా తెలుగుబిడ్డ ఎన్నిక కానున్నారు. అంతా ఘంటాప‌థంగా ఎలా చెప్ప‌గ‌లుతున్నారు అంటే అందుకు త‌గిన లెక్క‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తుండంటాన్ని బ‌ట్టే! ఆగస్టు ఐదున జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 788 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఓటు వేస్తారు. ఇప్పుడున్న విశ్లేషణలలో ఎన్‌డీఎ తరఫున బ‌రిలో నిలిచిన కేంద్ర మాజీ మంత్రి వెంకయ్య నాయుడుకు వెంకయ్యకు 485/788 ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల మద్దతు ఉందని ఎన్డీఏ తరఫు ఎన్నికల పర్యవేక్షకులు చెప్తున్నారు.

మొత్తం ఎలక్టోరల్ కాలేజ్ సంఖ్య 790. అయితే బీజేపీ ఎంపీలు అనిల్ మాధవ్ ధావే, వినోద్ ఖన్నాలు ఇటీవలే మృతి చెందారు. దీనితో ఈ సంఖ్య 788కు తగ్గింది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. లోక్‌సభలో మొత్తం సభ్యులు 544. కాగా బీజేపీ నాయకత్వపు ఎన్డీఏ బలం ఇప్పుడు 337కు చేరుకుంది. కాగా ఎగువసభ అయిన రాజ్యసభలో మొత్తం 244 మంది సభ్యులలో ఎన్‌డీఏకు 77 మంది ఎంపీల బలం ఉంది. ఇక ఎన్డీయేతర పార్టీలు అయిన అన్నాడీఎంకె, టీఆర్‌ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా నాయుడుకు మద్దతు ప్రకటించాయి. దీనితో లోక్‌సభలో ఎన్డీఎ అభ్యర్థికి 54 మంది సభ్యుల అదనపు మద్దతు, ఇక రాజ్యసభలో 17 మంది ఇతరుల తోడు లభించింది.

మొత్తంగా 60 శాతానికి పైగా ఓట్లు ఆయనకు అనుకూలంగా ఉండటంలో నాయుడు తమ ప్రత్యర్థి ప్రతిపక్షాల నామినీ గోపాల్ కృష్ణ గాంధీపై సునాయాసంగా గెలుస్తారనే ధీమా వ్యక్తం అవుతోంది. త‌ద్వారా తెలుగుగ‌డ్డ‌కు చెందిన సీనియ‌ర్ నేత ఉప రాష్ట్రప‌తి కానున్నార‌ని విశ్లేషిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు