కేటీఆర్‌ జీతం ఎంతొ తెలుసా?

కేటీఆర్‌ జీతం ఎంతొ తెలుసా?

తెలంగాణ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు ఆదాయపు పన్ను చెల్లించారు. గ‌త ఏడాది మంత్రిగా త‌న‌కు వ‌చ్చిన జీతాన్ని బ‌ట్టి ప‌న్ను చెల్లించారు. గ‌త ఆర్ధిక సంవ‌త్స‌రానికి కేటీఆర్‌కు 7.22 ల‌క్ష‌ల జీతం వ‌చ్చింది.  దీనికి గాను త‌న జీతంపై ప‌డే ఆదాయ‌పు ప‌న్నును మంత్రి చెల్లించారు. ఈమేర‌కు  రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో ఆర్టీ నెంబరు 159ని విడుదల చేసింది. ప్రభుత్వ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ పేరు మీద‌ ఆదేశాలు వెలువడ్డాయి.
   
2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.7.22 లక్షలను మంత్రి జీత భత్యాల నుంచి చెల్లిస్తున్నట్టు సంబంధిత ఉత్తర్వుల్లో వెల్లడించారు. పన్ను 2016 జులై ఒకటి నుంచి 2017 పిబ్రవరి 28 వరకు కట్టినట్టు తెలియజేశారు.
   
మంత్రులకు జీతభత్యాలు చెల్లించే పద్దుకింద ప్రభుత్వం మంత్రి ఆదాయపన్నును రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపన్ను శాఖకు విడుదల చేసింది.
   
అయితే.. ఇది మంత్రి జీతభత్యాల వరకు చెల్లించిన పన్ను మాత్రమే . ఇతర ఆదాయ వనరుల ఆధారంగా ఆయనకు వచ్చే రాబడిపై పన్ను చెల్లించిందీ లేనిదీ ఇంకా తెలియరాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English