వెంకయ్య నామినేషన్ కు చంద్రబాబును ఎందుకు పిలవలేదో..

వెంకయ్య నామినేషన్ కు చంద్రబాబును ఎందుకు పిలవలేదో..

తన చిరకాల మిత్రుడు... కేంద్రంలో తన కోసం చక్రం తిప్పే రాజకీయ దురంధరుడు వెంకయ్యనాయుడు ఉప రాష్ర్టపతి పదవికి నామినేషన్ వేస్తుంటే తాను కూడా హాజరుకావాలనుకున్న చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ నుంచి ఆయనకు ఎలాంటి ఆహ్వానం రాలేదు సరికదా... కనీసం వెంకయ్య కూడా మొహమాటానికైనా పిలవలేదట. దీంతో అసలే వెంకయ్య తోడు పోతోందే అన్న బాధలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు పిలుపు కూడా దక్కలేదని తెగ బాధపడుతున్నారట.

నిజానికి వెంకయ్యకు ఉప రాష్ర్టపతి పదవి అనగానే చంద్రబాబుదే హడావుడి అని అంతా అనుకున్నారు. చంద్రబాబు కూడా నామినేషన్ కార్యక్రమానికి తనను పిలుస్తారని భావించారు. అందుకే ఈ రోజు ఏపీ మంత్రివర్గ సమావేశం ఉంటే దాన్ని వాయిదా కూడా వేశారు. తాను ఢిల్లీ వెళ్లాల్సి ఉందని... మీటింగు ఇంకో రోజు పెట్టకుందామని చెప్పారట. అయితే... చంద్రబాబును ఎవరూ పిలవకపోవడంతో ఆయన వెంటనే మంత్రులందరికీ మళ్లీ సమాచారం పంపించి సమావేశానికి రావాలని పిలిచారట.

అయితే... వెంకయ్యనాయుడి నామినేషన్ కు బీజేపీ పెద్దలే వెళ్లారు. ఇతర మిత్రపక్షాలను పిలవలేదు. ఇందుకు సమయాభావం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. అయితే... మిగతావారంతా ఒకటి తాను ఒకటి అనుకునే చంద్రబాబు మాత్రం ఈ నెగ్లిజెన్సీని తీరని అవమానంగా భావిస్తున్నారట.

అయితే... ఉప రాష్ర్టపతి ఎన్నికల్లో కేవలం ఎంపీలే ఓటు వేస్తారు. దీంతో బీజేపీకి ఇతర పార్టీల అవసరం కొద్దిమేర మాత్రమే ఉంది. ఎటూ చంద్రబాబు వెంకయ్య కు మద్దతిస్తారు. కాబట్టి చంద్రబాబును పెద్దగా మచ్చిక చేసుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ కూడా భావించి ఉంటుందని.. అందుకే ఆయన్ను పిలవలేదని టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English