నేనిక ఏ పార్టీకి చెందినవాణ్ని కాను

నేనిక ఏ పార్టీకి చెందినవాణ్ని కాను

భారతీయ జనతా పార్టీకి తన సొంత రాష్ర్టంలో ఏమాత్రం ప్రాభవం లేని నాటి నుంచి ఇప్పుడు దేశాన్నేలే పార్టీగా ఎదిగిన వరకు ప్రతి క్షణం అంటిపెట్టుకుని ఉన్న వెంకయ్యనాయుడు ఇప్పుడా పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఉప రాష్ర్టపతి పదవికి ఆయన పోటీ పడుతుండడంతో బీజేపీకి రాజీనామా చేసి రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీంతో ఆయన తల్లినొదిలిన పసిబిడ్డలా మారారు. ఇప్పుడు బీజేపీ తన పార్టీ కాదని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నానని అన్నారు.

నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకయ్య బీజేపీని వదిలినందుకు ఓ వైపు బాధపడుతూనే, భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతలను తలపైకి ఎత్తుకుంటున్నందుకు ఆనందంగానే ఉందని అన్నారు.  తానిక ఏ పార్టీకి చెందనని... రాజకీయ పార్టీలకు అతీతంగా తన కొత్త జీవితం మొదలుపెట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

ఉప రాష్ట్రపతి బాధ్యతలు ఎలా ఉంటాయి... వాటిని ఎలా నిర్వర్తించాలి.. వంటి విషయాలన్నీ తనకు తెలుసునని... తాను ఈ పదవికి ఎంపికైతే రాజకీయాలకు అతీతంగా ఎలాంటి పక్షపాతం లేకుండా పదవికి వన్నె తెస్తానని మాటిచ్చారు.  గతంలో ఉప రాష్ట్రపతులుగా పనిచేసిన వారి అడుగు జాడల్లో నడుస్తానని వెంకయ్యనాయుడు వెల్లడించారు. పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తానని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English