త‌న బ‌ర్త్‌డేను స్పెష‌ల్‌గా జ‌ర‌పండి అంటున్న కేటీఆర్‌

త‌న బ‌ర్త్‌డేను స్పెష‌ల్‌గా జ‌ర‌పండి అంటున్న కేటీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ అంతే స్థాయిలో పేజ్‌3 కార్య‌క్రమాల్లో పాల్గొనే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాట్ సెల‌బ్రిటీగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ఏ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మ‌మైన కేటీఆర్ ప్రారంభిస్తే లేదా హాజ‌రయితే అది వార్త‌ల్లో నిలిచే తీరే వేరు. ఇక టీఆర్ఎస్ భ‌విష్య‌త్ నేత‌గా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ వార‌సుడిగా ఇప్ప‌టికే అన‌ధికారికంగా గులాబీ శ్రేణుల‌న్నీ భావిస్తున్నాయి. గౌర‌విస్తున్నాయి కూడా! అలాంటి కేటీఆర్ త‌న బ‌ర్త్‌డే సో స్పెష‌ల్‌గా నిర్వ‌హించ‌మ‌ని తెలిపారు.

జూలై 24వ తేదీన మంత్రి కేటీఆర్ బ‌ర్త్ డే. కేటీఆర్‌కు హోదా, ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ కార‌ణంగా స‌హ‌జంగానే మీడియాలో హ‌డావుడి, అడ్వ‌ర్టైజ్‌మెంట్లు, సిటీలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వంటి హ‌ల్‌చ‌ల్ మామూలుగా ఉండ‌దు అనేది ప‌బ్లిక్ టాక్‌. అయితే ఈ సారి త‌న బ‌ర్త్‌డే భిన్నంగా జ‌ర‌పాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు. త‌న‌ను క‌లిసి శుభ‌కాంక్ష‌లు తెలుపుతూ బొకేలు ఇవ్వ‌డం, కేక్‌లు కోయ‌డం, ఫ్లెక్సీలు పెట్ట‌డం వంటివి చేయ‌వ‌ద్ద‌ని కేటీఆర్ పార్టీ శ్రేణులు, అనుచ‌రుల‌కు పిలుపునిచ్చారు. బ‌దులుగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపట్టిన హ‌రిత‌హారంలో పాల్గొనాలని కోరారు. మొక్కలు నాటే కార్య‌క్ర‌మంలో చురుకుగా పాల్గొని హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

కాగా, పుర‌పాల‌క శాఖ బాధ్య‌త‌లు కూడా చూస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణ‌లోని ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఎక్క‌డా ఫ్లెక్సీలు క‌ట్ట‌వ‌ద్ద‌ని గ‌తంలో ఆదేశాలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌లు సంద‌ర్భాల్లో పార్టీ నేత‌లు దీన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న ఫైర్ అయ్యారు. తన పుట్టిన రోజు నేప‌థ్యంలో ఒక‌వేళ పార్టీ నేత‌లు పాత సంప్ర‌దాయాన్ని ఫాలో అయితే ఇబ్బంది ప‌డాల్సిన ప‌రిస్థితి రాకుండా ముంద‌స్తుగానే అల‌ర్ట్ చేశార‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు