మహేష్‌కి మాస్‌ రెస్పాన్స్‌ వీక్‌!

మహేష్‌కి మాస్‌ రెస్పాన్స్‌ వీక్‌!

'స్పైడర్‌' చిత్రానికి పెట్టిన ఖర్చుకి 'బాహుబలి' తర్వాత ఎక్కువ బిజినెస్‌ జరిగుండాలి. నిర్మాతలు అదే ఎక్స్‌పెక్టేషన్‌ బిజినెస్‌ ఆలస్యంగా ఓపెన్‌ చేసారు. ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని విడుదలకి ముందు బిజినెస్‌ స్టార్ట్‌ చేసారు.

'స్పైడర్‌' అనే టైటిల్‌ పెట్టడం, టీజర్‌ మరీ హైఫైగా వుండడంతో ఇదేదో మాస్‌ కేంద్రాల్లో ఆడే సినిమా కాదని ట్రేడ్‌ వర్గాలు ఒక అంచనాకి వచ్చేసాయి. మామూలుగా మురుగదాస్‌, మహేష్‌ కాంబినేషన్‌ అంటే బిజినెస్‌ టాప్‌ లెవల్లో జరగాలి.

కానీ స్పైడర్‌కి పలు కేంద్రాల్లో 'జై లవకుశ' కంటే తక్కువ ఆఫర్లు వచ్చాయి. మహేష్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాలు తప్ప మామూలువి మాస్‌ సెంటర్స్‌లో అంతగా రన్‌ అయిన హిస్టరీ లేకపోయే సరికి స్పైడర్‌ వాలకం చూసి ఇది మన సినిమా కాదని అక్కడి సినీ వ్యాపారులు డిసైడ్‌ అయిపోయారు. దీంతో ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికంటే చాలా తక్కువ ఆఫర్లకే నిర్మాతలు ఓకే అనాల్సి వస్తోంది. అయితే బిజినెస్‌ అనుకున్న దానికంటే తక్కువ చేయడం వల్ల నిర్మాతలకి మరో లాభముంటుంది.

ఈ చిత్రం సంచలన విజయం సాధించిన పక్షంలో లాభాల్లో సింహభాగాన్ని వాళ్లే తీసేసుకోవచ్చు. అయితే విడుదలైన తర్వాత వచ్చే ఫలితాన్ని గురించి ఆలోచించి ముందుగా రిస్క్‌ చేయలేరు కనుక ఓ విధంగా ఇది నిర్మాతలపై అదనపు భారమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు