వెంక‌య్య‌కు శుభాకాంక్ష‌లు చెప్పి ప‌వ‌న్ ఎక్క‌డికో ఎదిగాడు

వెంక‌య్య‌కు శుభాకాంక్ష‌లు చెప్పి ప‌వ‌న్ ఎక్క‌డికో ఎదిగాడు

ఉప‌రాష్ట్రప‌తి ప‌దవికి ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఎంపిక‌యిన బీజేపీ సీనియ‌ర్ నేత ఎం.వెంక‌య్య‌నాయుడుకు జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. వెంక‌య్య‌నాయుడును ఎంపిక చేసినందుకు బీజేపీ అధిష్టానానికి సైతం ప‌వ‌న్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య‌కు అడ్వాన్స్ కంగ్రాట్స్ తెలిపిన ప‌వ‌న్...ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వికి ఆయ‌న వ‌న్నె తెస్తార‌ని ధీమా వ్య‌క్తం చేయ‌డం విశేషం.

కాగా, ప్ర‌త్యేక హోదా, ఏపీకి సంబంధించిన హామీల విష‌యంలో వెంక‌య్య‌నాయుడు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ల మ‌ధ్య ప‌లు సంద‌ర్భాల్లో మాట‌ల యుద్ధం సాగిన‌ప్ప‌టికీ ఉప‌ రాష్ట్రప‌తి ప‌ద‌వి అభ్య‌ర్థిగా ఎన్నికయిన సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు చెప్ప‌డం ద్వారా ప‌వ‌న్ త‌న హుందాత‌నాన్ని చాటుకున్నార‌ని అంటున్నారు. అంశాల వారీగా విబేధాలు ఉంటాయ‌నే త‌ప్ప వ్య‌క్తుల‌తో విబేధించ‌డం త‌న నైజం కాద‌ని ప‌వ‌న్ చాటుకున్నాడ‌ని ప‌లువురు అంటున్నారు.

కాగా, వెంక‌య్య‌నాయుడుకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ఇది `` ఉప రాష్ట్రపతి పదవికి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన తెలుగు బిడ్డ, గౌరవనీయులైన శ్రీ వెంకయ్య నాయుడు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సీనియర్ రాజకీయ నాయకునిగా అపార అనుభవమున్న శ్రీ వెంకయ్య నాయుడు ఉప రాష్ట్ర పదవికి వన్నె తెస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నాను.ఇది తెలుగు వారందరూ గర్వించదగిన పరిణామంగా,తెలుగు వారికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. వెంకయ్య నాయుడు గారిని అభ్యర్థిగా ఎంపిక చేసిన బీజేపీ అధినాయకత్వానికి అభినందనలు తెలియచేస్తున్నాను. -జైహింద్`` అంటూ శుభాకాంక్ష‌లు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు