పిసి చాకో పిల్ల చేష్టలు

పిసి చాకో పిల్ల చేష్టలు

తమ ఎజెండాలోనే తెలంగాణ అంశం లేదని చెప్పి ఎఐసిసి అధికార ప్రతినిథి పి.సి.చాకో వివాదాన్ని రాజేశారు. చాకో, అంత మాట అంటావా? అని కాంగ్రెసు పార్టీలోని తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా, 'నేను అలా అనలేదు' అని ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారాయన.

వివాదాన్ని రాజేసినవారే, తమ మెడకు ఆ వివాదం చుట్టుకోగానే 'వక్రీకరణ' అనడం పరిపాటిగా మారింది. తలపండిన రాజకీయ నాయకులకే తాము మాట్లాడే మాటలపై స్పష్టత లేనప్పుడు వీళ్ళ పాలనలో దేశం ఎలా బాగుపడుతుంది? పిల్ల చేష్టలు, వెకిలి చేష్టలు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మానుకోవాలి. మాట అనేసి, మాట మార్చిన చాకో బాగానే ఉన్నారు.

చాకోపైన ఆగ్రహం వ్యక్తం చేసినవారే పాపం ఇప్పుడేం చేయాలో తెలియక బాధపడ్తున్నారంట. టి.కాంగ్రెసు ఎంపీలు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. చాకో వ్యాఖ్యలతో ఇప్పుడు మిగిలిన టి.కాంగ్రెసు ఎంపీల బృందంలో ముగ్గురి పరిస్థితీ అయోమయంగా తయారైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English