శబరిమల హుండీలో పాక్ కరెన్సీ

శబరిమల హుండీలో పాక్ కరెన్సీ

కేరళలోని ప్రఖ్యాత అయ్యప్పస్వామి దేవాలయం  ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప‌రిణామం చోటుచేసుకుంది. హుండీలో పాకిస్థాన్ కరెన్సీకి చెందిన రూ. 20 నోటు లభించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇటీవల దేవాలయ హుండీని తెరిచి భక్తుల విరాళాలను నిర్వాహకులు లెక్కిస్తుండగా పాక్ కరెన్సీ బయటపడింది.

హుండీలో విదేశీ కరెన్సీ రావడం సాధారణమే అయినా, అయితే పాకిస్థాన్ కరెన్సీ నోటు కావడంతో తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఒక పోలీసు అధికారి తెలిపారు.

పాతానంతిట్ట జిల్లాలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు మూడునెలలు మాత్రమే తెరిచి ఉండే ఈ దేవాలయం మిగతా రోజుల్లో మూసి ఉంటుంది.

మలయాళ క్యాలెండర్ ప్రకారం ప్రతినెల తొలిరోజు నుంచి ఐదు రోజులపాటు నెలవారీ పూజల కోసం మాత్రం ఆలయాన్ని తెరుస్తారు. కాగా, తాజాగా వెలుగులోకి వ‌చ్చిన పాకిస్తానీ క‌రెన్సీ భ‌క్తులు పూర్తి ర‌ద్దీ ఉన్న స‌మ‌యంలో హుండీలో చేరి ఉంటుందా లేదా సాధార‌ణ సంద‌ర్భంలోనే ఇలా జ‌రిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు