జ‌గ‌న్ వ్యూహాల‌కు పీకే ఫీజు ఎంత‌?

జ‌గ‌న్ వ్యూహాల‌కు పీకే ఫీజు ఎంత‌?

తెలుగు రాజ‌కీయాల్లో ఇప్పటివ‌ర‌కూ ఉన్న‌పీకేకు మ‌రో కొత్త పీకే యాడ్ అయిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ పీకే అన్న వెంట‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్తుకు రావ‌టం మామూలే. కానీ.. కొత్త‌గా మ‌రో పీకే ఎంట్రీ ఇచ్చిన నేప‌థ్యంలో.. పీకే అన్న వెంట‌నే.. ఏ పీకే అన్న డౌట్ ను వ్య‌క్తం చేసే ప‌రిస్థితి.

ఇంత‌కీ ఈ కొత్త పీకే ఎవ‌రంటున్నారా? ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పొలిటిక‌ల్ స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇచ్చేందుకు పెట్టుకున్న ప్ర‌శాంత్ కిశోర్‌.  పోల్ మేనేజ్ మెంట్లో మ‌నోడికి తిరుగులేని అనుభ‌వం ఉందని చెబుతారు. అయ్య‌గారుఎక్క‌డ అడుగు పెడితే అక్క‌డ స‌క్సెస్ ప‌క్కా అన్న మాట వినిపిస్తుంటుంది. అయితే.. ఇంత‌టి పేరుప్ర‌ఖ్యాతులు ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల జ‌రిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలుపుబాట ప‌ట్టించేందుకు ఈ పీకే వేసిన ప్లాన్లు ఏమీ వ‌ర్క్ వుట్ కాలేదు.

ఇదిలా ఉంటే.. త‌న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిశోర్ నుపెట్టుకున్న‌ట్లుగా గ‌డిచిన కొంత‌కాలంగా వార్త‌లు వ‌చ్చినా అధికారికంగా మాత్రం ప్ర‌క‌టించింది లేదు. తాజాగా.. పార్టీ నేత‌లకు అధికారికంగా ప్ర‌శాంత్ భూష‌న్‌ను జ‌గ‌న్ ప‌రిచ‌యం చేయ‌టం.. పార్టీ అంశాల‌పై పీకే త‌న అభిప్రాయాల్ని చెప్ప‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. త‌న‌కు రాజ‌కీయ స‌ల‌హాలు ఇచ్చే ఈ పీకేకు జ‌గ‌న్ ఇస్తున్న ఫీజు ఎంత‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఏడాదికి ఇంత అని కాకుండా.. 2019 ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ ప్యాకేజీగా మాట్లాడుకున్న‌ట్లుగా స‌మాచారం.  2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు పూర్తి అయ్యే వ‌ర‌కూ రాజ‌కీయ‌ప‌ర‌మైన అంశాలకు సంబంధించి జ‌గ‌న్ కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చేందుకు వీలుగా ఒక డీల్ ఓకే అయిన‌ట్లు చెబుతున్నారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ప్ర‌శాంత్ కిశోర్‌కు జ‌గ‌న్ రూ.50 కోట్ల వ‌ర‌కూ ఇవ్వ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల వ‌ర‌కూ పీకే అందించే సేవ‌ల‌కు జ‌గ‌న్ ఈ భారీ మొత్తం ఆఫ‌ర్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇంత‌కు మించే పారితోషికం ఉంటుంద‌ని కొంద‌రు చెబుతున్నా.. అలాంటిదేమీ లేద‌ని రూ.50 కోట్ల‌కు డీల్ ఓకే అయ్యింద‌న్న మాట జోరుగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English