ఎమ్మెల్యేను చంపేస్తాన‌ని బెదిరించిన మంత్రి

ఎమ్మెల్యేను చంపేస్తాన‌ని బెదిరించిన మంత్రి

అధికారం త‌మ‌దేన‌న్న అహంకారం కావ‌చ్చు. స్వ‌త‌హాగా ఉన్న దుర్బుద్ధి అయి ఉండ‌వ‌చ్చు కానీ జమ్ము కశ్మీర్ మంత్రి ఇమ్రాన్ అన్సారీ మాత్రం తానో ప్ర‌జాప్ర‌తినిధిని అనే విష‌యాన్ని మ‌రిచి ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేను తీవ్ర ప‌ద‌జాలంతో బెదిరించారు.

ఏకంగా "నిన్ను ఇక్కడే కొట్టి చంపగలను" అని వార్నింగ్ ఇచ్చారు. విప‌క్ష నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే దేవేందర్ రాణాను అధికార‌పార్టీకి చెందిన మంత్రి ఇలా అసెంబ్లీలోనే బెదిరించారు.జీఎస్టీ అమలుపై చర్చ సందర్భంగా క‌శ్మీర్ అసెంబ్లీలో తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.

తొలుత రాణా మాట్లాడుతూ, రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సభ్యులందరూ పార్టీలకతీతంగా జీఎస్టీని ప్రస్తుతమున్న రీతిలో ఆమోదించరాదని సూచించారు. దీనిపై స్పందించిన మంత్రి అన్సారీ ప్రతిపక్ష సభ్యుడు ద్వంద్వ ప్రమాణాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. జీఎస్టీని వ్యతిరేకిస్తున్న రాణా,తన వ్యాపారాలన్నింటినీ కొత్త పన్ను విధానంలోకి ఎప్పుడో మార్చుకున్నారని చెప్పారు.

ఇందుకు బదులుగా రాణా స్పందిస్తూ తాను పన్ను ఎగవేతదారుడిని కాను అన్నారు. ఈ వ్యాఖ్యపై మండిపడిన మంత్రి "త‌ప్పుడు ప‌నులు చేస్తున్న నిన్ను ఇక్కడే కొట్ట చంపగలను" అని హెచ్చ‌రించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వెంటనే జోక్యం చేసుకున్న డిప్యూటీ స్పీకర్ "మీరు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలు ఇలాంటివి స‌హించ‌రు"అని హెచ్చరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు