'అసెంబ్లీ బాగుందంటే టీడీపీ.... బాగలేదంటే వైసీపీ'

'అసెంబ్లీ బాగుందంటే టీడీపీ.... బాగలేదంటే వైసీపీ'

'అసెంబ్లీ బాగుందంటే టీడీపీలోకి వెళ్తున్నానంటారు....బాగలేదంటే వైసీపీలో చేరుతున్నానంటారు' అని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చ‌మ‌త్క‌రించారు.

ఏపీ నూతన సచివాలయాన్ని ఆయ‌న సోమ‌వారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ ఎలా ఉంద‌ని ప్ర‌శ్నించిన విలేక‌రికి ఉండ‌వ‌ల్లి త‌న‌దైన చ‌మ‌త్కార శైలిలో స‌మాధాన‌మిచ్చారు.

కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుతో కలిసి నూత‌న అసెంబ్లీ భ‌వ‌నాన్ని చూడడానికి  ఉండ‌వ‌ల్లి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. కొత్త అసెంబ్లీని చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానన్నారు. అదే  విషయాన్ని మల్లాది విష్ణుకు చెబితే ఆయన ఈ రోజు బాగుందని అసెంబ్లీకి తీసుకువ‌చ్చార‌ని చెప్పారు.

అసెంబ్లీ నిర్మాణం బాగుందని, కొద్దిగా వర్షపు నీరు వచ్చినంత మాత్రాన వివాదం చెయ్యాల్సిన అవసరం లేదని ఉండ‌వ‌ల్లి అభిప్రాయపడ్డారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేనని, 2019 ఎన్నికల్లో పోటీచేయనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు