చైనాకు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చిన భార‌త్‌

చైనాకు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చిన భార‌త్‌

ఏదో విధంగా మ‌డ‌త పేచీలు పెడుతూ.. అడ్డ‌దిడ్డ‌మైన వాద‌న‌లు వినిపించ‌టం చైనాకు మామూలే. డ్రాగ‌న్ తో పెట్టుకోవ‌టం ఎందుకులే అన్న‌ట్లుగా ప్ర‌భుత్వాలు వ్య‌వ‌హ‌రించ‌టం తెలిసిందే. అయితే.. అలాంటి రోజుల‌కు కాలం చెల్లిన వైనాన్ని తొలిసారి ద‌మ్ముగా మాట్లాడి సంచ‌ల‌నం సృష్టించింది మోడీ స‌ర్కారు. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ భార‌త్ పై త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్న చైనా.. ఇటీవ‌ల నోరు జారి.. చాలా పెద్ద మాట‌లే మాట్లాడింది.

భార‌త సైన్యం చ‌రిత్రను మ‌ర్చిపోకూడ‌ద‌ని.. చ‌రిత్ర పాఠాల్ని నేర్చుకోవాల‌ని 1962 నాటి యుద్ధాన్ని గుర్తు చేస్తూ ఇటీవ‌ల చైనా చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌త ర‌క్ష‌ణ‌శాఖా మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అయ్యారు. చైనా గ‌త చ‌రిత్ర‌ను గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. కానీ.. 1962 నాటి ప‌రిస్థితులు వేరు.. 2017లో నాటి ప‌రిస్థితులు వేరంటూ భార‌త్ లో మారిన సీన్ అర్థ‌మ‌య్యేలా వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌నం సృష్టించారు జైట్లీ.

ఇండియా టుడే మిడ్ నైట్ కాంక్లేవ్ లో పాల్గొన్న జైట్లీ.. భార‌త్ పై చైనా ప్ర‌తినిధి వు కియ‌న్ చేసిన వ్యాఖ్య‌లకు దిమ్మ తిరిగే రీతిలో జైట్లీ స‌మాధాన‌మిచ్చారు. భూటాన్ లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించేందుకు చైనా ప్ర‌య‌త్నిస్తుంద‌న్న విష‌యాన్ని భూటాన్ ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా చెప్పింద‌ని.. కానీ చైనా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్ని మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంద‌న్నారు.

ప్ర‌స్తుతం చైనా చూస్తున్న భార‌త్ 1962 నాటిది కాద‌ని.. ఇది 2017 నాటి ఇండియా అని గుర్తు పెట్టుకుంటే మంచిదంటూ జైట్లీ చేసిన ఘాటు వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. అప్ప‌టి ప‌రిస్థితుల్ని గుర్తు పెట్టుకోమని వారంటే.. ప‌రిస్థితి 1962కు భిన్నంగా ఉంటుంద‌న్నారు. భూటాన్ ప్ర‌భుత్వ  ప్ర‌క‌ట‌న అనంత‌రం స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌ని.. అది భూటాన్ భూభాగ‌మేన‌ని తేలింద‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు