టెన్నిస్ స్టార్ చేసిన యాక్సిడెంట్ తో ఒక‌రు మృతి

టెన్నిస్ స్టార్ చేసిన యాక్సిడెంట్ తో ఒక‌రు మృతి

క్రీడావార్త‌ల్లో ప్ర‌ముఖంగా క‌నిపించే అగ్ర‌శ్రేణి టెన్నిస్ స్టార్ క్రైం వార్త‌ల్లోకి వ‌చ్చేశారు. అమెరికా టాప్ టెన్నిస్ స్టార్ల‌లో ఒక‌రైన వీన‌స్ విలియ‌మ్స్ ఒక యాక్సిడెంట్ కేసులో చిక్కుకున్నారు. ఓ రోడ్డు ప్ర‌మాదానికి కార‌ణ‌మైన ఆమె పుణ్య‌మా అని ఓ వృద్ధుడు ప్రాణాలు విడిచిన వైనం ఇప్పుడు ఆమెను కేసు చిక్కుల్లోకి చిక్కునేలా చేస్తోంది.

ఈ నెల 9న ఫ్లోరిడాలో వీన‌స్ విలియ‌మ్స్ న‌డుపుతున్న కారు.. ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌రో కారును ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 78 ఏళ్ల వృద్ధుడు జెరోమ్ బార్స‌న్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కారు న‌డుపుతున్న స‌ద‌రు వృద్ధుడు స‌తీమ‌ణి కూడా గాయ‌ప‌డ్డారు. త‌ల‌కు తీవ్రంగా గాయ‌ప‌మైన బార్స‌న్‌.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఇటీవ‌ల మ‌ర‌ణించాడు.

యాక్సిడెంట్ చేసిన వీన‌స్ డ్రైవింగ్ చేసే స‌మ‌యంలో ఫోన్ మాట్లాడ‌టం.. డ్ర‌గ్స్ తీసుకొని ఉండ‌టం లాంటివి చేయ‌లేద‌న్న మాట‌ను పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మృతుడి స‌తీమ‌ణి మాత్రం తాను ట్రాపిక్ రూల్స్‌ను ఫాలో అయ్యాన‌ని.. సిగ్న‌ల్స్ ను అనుస‌రిస్తూ కారు డ్రైవ్ చేస్తుంటే.. వీన‌స్ కారు హ‌టాత్తుగా రావ‌టం వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వీన‌స్ త‌ప్పిదం వ‌ల్లే యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు విచార‌ణ‌ను పోలీసులు ముమ్మ‌రం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు