జ‌గ‌న్‌ను ఓదారుస్తున్న ఉండ‌వ‌ల్లి

జ‌గ‌న్‌ను ఓదారుస్తున్న ఉండ‌వ‌ల్లి

రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కొనకళ్ల నారాయణరావు మండిప‌డ్డారు. ఉండవల్లి పగటి కలలు కంటున్నార‌ని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల సహకారంతో తెలుగుదేశం ప్రభుత్వం విజయం సాధిస్తుందన్న విషయాన్ని  తెలుసుకుంటే మంచిదని అన్నారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుట్రలు పన్నినా తెలుగుదేశం పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు వైసీపీ నాయకుడు జగన్‌మోహన్ రెడ్డికి ఇచ్చిన నివేదికలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం 40శాతం కు పైగా ఓట్లతో విజయం సాధిస్తుందని చెప్పార‌ని కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌రావు పేర్కొన్నారు. దీంతో ఆందోళనలో పడ్డ జగన్‌మోహ‌న్ రెడ్డి ఓదారుస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

వైఎస్ రాజశేఖర్రెడ్డి బ‌తికి ఉండి ఉంటే 2011లోపే పోలవరం పూర్తయ్యేదని కాకి మాటలు చెబుతున్న ఉండవల్లి 2004 నుంచి 2009 వరకు పోలవరం కోసం ఏం చేశారో చెప్పాలని కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌రావు ప్ర‌శ్నించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం పోలవరం హెడ్ వ‌ర్క్స్‌పై తగు కృషి చేయకుండా కమీషన్లు ఎక్కువగా వచ్చే కాల్వ‌ల‌పైనే దృష్టిని కేంద్రీకరించిందని ఆరోపించారు. వైఎస్ హయాంలో పోలవరం పనులు 5శాతం కూడా పూర్తి కాలేదు. కమీషన్ల కోసం మట్టి పనులు మాత్రమే నిర్వహించారని తెలిపారు.భూసేకరణ, కోర్టు కేసులు పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని మండిప‌డ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును కేవలం తమ స్వార్థానికి, గుత్తేదారుల, ఎన్నికల ప్రయోజనాలకు వినియోగించుకున్నారని కొన‌క‌ళ్ల విమ‌ర్శించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంతోపాటు ముంపునకు గురవుతున్న నిర్వాసితులందరికీ న్యాయబద్ధమైన పరిహారం అందించడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేసేలా కృషి చేస్తున్నామ‌ని  కొన‌క‌ళ్ల నారాయ‌ణ రావు తెలిపారు. పోలవరం పూర్తెతే తన రాజకీయ ఉనికిని కోల్పోతామనే భయంతో తల్లి,పిల్ల కాంగ్రెస్‌లు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయ‌నిమండిప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే తమ అనుయాయులతో కేసులు వేయిస్తూ అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తున్నారని  కొన‌క‌ళ్ల నారాయ‌ణ రావు ఆక్షేపించారు. పదేళ్లపాటు ఎంపీగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారో ఉండవల్లి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరానికి జాతీయ హోదా,ప్రత్యేక హోదా గురించి అప్పటి ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేలేదని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు