గూగుల్‌కు 17 వేల కోట్ల జ‌రిమానా!

గూగుల్‌కు 17 వేల కోట్ల జ‌రిమానా!

మోస్ట్ పాపుల‌ర్ ఇంట‌ర్నెట్‌ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు యురోపియ‌న్ యూనియ‌న్ భారీ జ‌రిమానా విధించింది. సెర్చ్‌లో త‌న షాపింగ్ స‌ర్వీస్‌ల‌నే ప్ర‌మోట్ చేసి.. ప్ర‌త్య‌ర్థి కంపెనీల డీమోట్ చేసింద‌న్న ఆరోప‌ణ‌లు గూగుల్‌పై ఉన్నాయి. దీనిపై విచార‌ణ జ‌రిపిన ఈయూ యాంటీ ట్ర‌స్ట్ విభాగం.. గూగుల్‌కు 242 కోట్ల యూరోల (సుమారు రూ.17570 కోట్లు) జ‌రిమానా విధించింది.

90 రోజుల్లోగా సెర్చ్‌లో త‌న షాపింగ్ స‌ర్వీస్‌లకు ఫేవ‌ర్ చేయ‌డాన్ని నిలిపేయాల‌ని ఆదేశించింది. లేదంటే ప్ర‌తిరోజూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు వ‌చ్చే ట‌ర్నోవ‌ర్‌లో 5 శాతం పెనాల్టీ వేస్తామ‌ని హెచ్చ‌రించింది.

ప్ర‌త్య‌ర్థి సంస్థ‌ల‌కు సెర్చ్‌లో తావు లేకుండా త‌న సంస్థ‌ల‌కు ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం ప్ర‌మోట్ చేసుకుంటూ వ‌చ్చింద‌ని ఈ సంద‌ర్భంగా ఈయూ క‌మిష‌న్ వెల్ల‌డించింది. ఏడేళ్లుగా దీనిపై ఆ క‌మిష‌న్ విచార‌ణ జ‌రుపుతోంది. ఈయూ యాంటీట్ర‌స్ట్ నిబంధ‌న‌ల ప్ర‌కారం గూగుల్ చేసింది చ‌ట్ట‌విరుద్ధం.

మెరిట్ ప్ర‌కారం పోటీలో ఉండాల్సిన‌ ఇత‌ర కంపెనీలకు ఆ అవ‌కాశం లేకుండా చేసింది. దీనివ‌ల్ల యురోపియ‌న్ యూనియ‌న్ క‌న్జూమ‌ర్లు స‌రైన ఎంపిక చేసుకొనే అవ‌కాశాన్ని కోల్పోయార‌ని క‌మిష‌న్ స్ప‌ష్టంచేసింది. ఏడేళ్లుగా గూగుల్‌పై ప‌దుల సంఖ్య‌లో కంపెనీలు ఫిర్యాదులు చేస్తూ వ‌చ్చాయి. ఈయూ యాంటీట్ర‌స్ట్ కేసులో ఇప్పుడు గూగుల్‌కు విధించిందే అతిపెద్ద జ‌రిమానా కావ‌డం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English