గోడ‌ను త‌న్ని గాయ‌ప‌డిన నారాయ‌ణ‌

గోడ‌ను త‌న్ని గాయ‌ప‌డిన నారాయ‌ణ‌

సీపీఐ నేత నారాయ‌ణకు వ‌య‌సు పైబ‌డుతున్నా స్పీడు మాత్రం కొంచెం కూడా త‌గ్గ‌లేదు. జ‌నంలోకి వెళ్లారంటే అదే ఊపు.. అదే దూకుడు. ప్ర‌జ‌ల‌ను వెంటేసుకుని వెళ్లి ఉద్య‌మాల‌కు దిగితే ఆయ‌న కుర్రాడైపోతారు. ఎక్క‌డ‌లేని శ‌క్తి కూడ‌దీసుకుని  ఈ భూస్వామ్య‌, పెత్తందారీ, పెట్టుబ‌డిదారీ వ్య‌వ‌స్థ‌ను కాలితో త‌న్ని కూల్చేయాల‌నుకుంటారు. మ‌న‌సులో ఉన్న ఆ విప్ల‌వ క‌సినంతా త‌న చేతల్లో చూపిస్తారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలోనూ అలాగే కాస్త ఆవేశానికి లోనై ఓ గోడ‌ను స్వ‌యంగా కూల్చేయ‌డానికి సిద్ధ‌మైన ఆయ‌న దాన్ని బాహుబ‌లి రేంజిలో కాలితో త‌న్ని త‌న్ని విర‌గ్గొట్ట‌గ‌లిగారు.. అయితే, ఆ క్ర‌మంలో స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు.

విశాఖలోని మధురవాడలో ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన భూములను పరిశీలించేందుకు నారాయణ కార్యకర్తలతో కలిసి వెళ్లారు. అక్కడ అక్రమంగా నిర్మిస్తున్న గోడను కాలితో తన్ని కూలగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ సంద‌ర్భంగా ఆయన కాలికి చిన్న గాయం కాగా సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఆయ‌న దూకుడు... గోడ‌ను కూల్చ‌డంలో ఆయ‌న చూపించిన బ‌లం.. చివ‌ర‌కు కూలిన గోడ భాగంలో కాలు చిక్కుకుపోవ‌డం వంటివ‌న్నీ ఈ చిత్రాల్లో చూడొచ్చు.  ఈ చిత్రాల్లో సీ గ్రీన్ క‌ల‌ర్ చొక్కాలో ఉన్న వ్య‌క్తే నారాయ‌ణ‌.

1) ఆక్ర‌మించి నిర్మించిన గోడ‌ను కూల‌గొట్ట‌డానికి పెద్ద పెద్ద అంగ‌లేసుకుంటూ నారాయ‌ణ వెళ్తున్నారు.
2) నిలువెత్తున్న ఉన్న ఆ గోడ‌ను కూల్చేందుకు కాలు పైకి లేపి బ‌లంగా త‌న్నారు. ఇలా.. సుమారు ప‌దిప‌దిహేను సార్లు త‌న్నేస‌రికి గోడ క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డి అక్క‌డున్న సిమెంటు ప‌ల‌క క‌దిలిపోయింది.
3) బ‌ల‌హీన‌ప‌డిన గోడ‌ను నారాయ‌ణ మ‌రింత బ‌లంగా త‌న్న‌డంతో అక్క‌డ ఒక్క‌సారిగా ప‌ల‌క విరిగి రంథ్ర‌మేర్ప‌డింది. అయితే.. ఊహించ‌ని రీతిలో అందులో నారాయ‌ణ కాలు చిక్కుకుపోయింది. దీంతో వెంట‌నే పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఒక్క ఉదున చేరుకుని ఆయ‌న్ను ప‌ట్టుకుని కాలిని అందులోంచి తీశారు.
4) కుడి  కాలికి మోకాలి కింద భాగంలో సిమెంటు ప‌ల‌క‌లు త‌గిలి స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English