కేసీఆర్ సాయం కూడా ఓ రేంజ్ లో ఉంది

కేసీఆర్ సాయం కూడా ఓ రేంజ్ లో ఉంది

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట ప‌వ‌ర్ ఎలా ఉంటుంద‌న‌టానికి తాజా ఉదంతం ఒక చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పాలి. త‌న ద‌గ్గ‌ర‌కు సాయం కోసం వ‌చ్చే వారి విష‌యంలో ఆయ‌న కానీ క‌న్వీన్స్ అయితే.. సాయం ఓ రేంజ్లో ఉంటుంది. అదే స‌మ‌యంలో.. చిర్రెత్తే సాయం అడిగితే.. బ‌డిత క‌ర్ర ప‌ట్టుకొని బాదేసినంత ఆగ్ర‌హంతో ఊగిపోవ‌టం కేసీఆర్‌కు మాత్ర‌మే సాధ్యం.

ముఖ్య‌మంత్రి ఆదేశాలు జారీ చేసినా.. ఓప‌ట్టాన ఫైళ్లు క‌ద‌ల‌ని ప‌రిస్థితి నెల‌కొన్న వేళ‌.. కేసీఆర్ మాట‌కు ఉండే స్పీడ్ చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాలి. ఈ మ‌ధ్య‌నే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా షురూ చేసిన మేక‌ల పంపిణీ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన సీఎం కేసీఆర్‌ను కొండ‌పాక మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామ‌చంద్రారెడ్డి క‌లిశారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న వేళ‌.. అధికార‌పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి గెలిచిన ఆయ‌న‌.. త‌ర్వాతి కాలంలో ఎన్టీఆర్‌తో విభేదించి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. కాల‌క్ర‌మంలో ఆయ‌న‌కున్న ఆస్తుల‌న్నీ పోయి.. ఈరోజు ఉండేందుకు సొంతిల్లు కూడా లేని దీన స్థితిలో ఉన్నారు. తాజాగా ఆయ‌న ప‌రిస్థితిపై మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

దొమ్మాట రామ‌చంద్ర‌రెడ్డి ఇబ్బందుల్ని తెలుసుకున్న కేసీఆర్ వెంట‌నే స్పందించి.. ఆయ‌న‌కు ఇంటి స్థ‌లం కేటాయించాల‌ని.. డ‌బుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాల‌ని చెప్ప‌టంతో పాటు రూ.25ల‌క్ష‌ల సాయాన్ని అందించాల‌ని క‌లెక్ట‌ర్‌కు ఆదేశించారు. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వారు ఆదేశాలు జారీ చేసిన త‌ర్వాత అమ‌లుకు స‌మ‌యం ప‌ట్ట‌టం మామూలే. కానీ.. తాజా ఉదంతంలో కేవ‌లం వారం వ్య‌వ‌ధిలోనే సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్లుగా రూ.25ల‌క్ష‌ల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును అధికారులు సిద్ధం చేశారు. అంతేనా.. డ‌బుల్ బెడ్రూం ఇంటిని కేటాయించారు.

ఈ రెండింటికి సంబంధించిన ప‌త్రాల్ని మంత్రి హ‌రీశ్ రావుకు అధికారులు అంద‌జేశారు. కొండ‌పాక‌కు వెళ్లిన హ‌రీశ్‌.. మాజీ ఎమ్మెల్యేకు ఆ ప‌త్రాల్ని అందించారు. సీఎం అలా ఆదేశాలు జారీ చేయ‌టం.. ఇలాసాయానికి సంబంధించిన మొత్తం చేతికి అంద‌టంతో దొమ్మాట ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయింది. ఇలాంటివి.. ముఖ్య‌మంత్రి  ఇమేజ్‌ను ప్ర‌జ‌ల్లో మ‌రింత పెంచేలా చేస్తాయ‌న‌టంలోసందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English