జ‌గ‌న‌న్నే నాకు శ్రీ‌రామ‌ర‌క్షః రోజా

జ‌గ‌న‌న్నే నాకు శ్రీ‌రామ‌ర‌క్షః రోజా

తాను వైసీపీని వీడ‌నున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను వైసీపీ ఎమ్మెల్యే రోజా ఖండించారు. జ‌గ‌న్ కు తాను జీవితాంతం రుణప‌డి ఉంటానని, వైసీసీని వీడే ప్ర‌స‌క్తే లేద‌నన్నారు. జ‌న‌సేన‌, టీడీపీలోకి తాను వెళ్తున్న‌ట్లు వ‌చ్చిన‌ వార్త‌ల‌పై మండిప‌డ్డారు.  ప‌నికిమాలిన టీడీపీ, జ‌న‌సేన‌లోకి వెళ్లే అవ‌స‌రం త‌న‌కు లేద‌న్నారు. త‌న‌తో మాట్లాడి నిర్ధారించుకోకుండా  జ‌న‌సేన‌లోకి వెళుతున్నాన‌ని ప‌త్రిక‌లు రాయ‌డం స‌బ‌బా? అని ఆమె ప్ర‌శ్నించారు.

త‌న‌ను సంవ‌త్స‌రం పాటు అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేయించిన‌ చంద్ర‌బాబు కు, జ‌గ‌న్ కు పోలిక లేద‌న్నారు. జ‌గ‌న్ త‌న‌ను సోద‌రి అని చెప్పుకుంటున్నార‌ని, తాను టీడీపీ నుంచి వైసీపీలోకి  రాగానే ఎమ్మెల్యేని చేశార‌ని రోజా అన్నారు. జీవితాంతం తాను వైసీపీలోనే ఉంటాన‌ని రోజా తెలిపారు. త‌న‌కు త‌ల్లిదండ్రులు లేరని, త‌నకు జ‌గ‌నే ర‌క్ష‌ణ ఇస్తున్నారని రోజా అన్నారు.  

ఏపీలో చంద్ర‌బాబు మ‌ద్య‌పానాన్ని మ‌రింత విస్త‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని రోజా మండిప‌డ్డారు. రాష్ట్రంలో ప్రజలకి అన్యాయం చేస్తే వైసీపీ చూస్తూ ఊరుకోద‌ని తెలిపారు. త‌మ  ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత అక్ర‌మార్కుల‌పై  ఉక్కుపాదం మోపుతామ‌ని చెప్పారు.

త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక మ‌హిళ‌ల మాన‌, ప్రాణాల‌ని కాపాడుతామ‌ని రోజా వ్యాఖ్యానించారు. కొన్ని ప‌త్రిక‌లు టీడీపీ ప్ర‌భుత్వానికి అనుకూలంగా వార్త‌లు రాస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. ప‌నికిమాలిన వారే అటువంటి రాత‌లు రాస్తున్నారని అన్నారు. గ‌తంలో ప్ర‌త్యేక హోదా కోసం మోదీని జ‌గ‌న్ క‌లిసి మాట్లాడితే, కేసుల కొట్టివేత కోసం మాట్లాడార‌ని కొన్ని పత్రికల్లో రాశార‌ని మండిప‌డ్డారు. నిజంగా వాళ్ల‌కి విలువలున్నాయా? అని ప్ర‌శ్నించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు