జ‌న‌సేన‌లోకి వైసీపీ ఫైర్ బ్రాండ్‌?

జ‌న‌సేన‌లోకి వైసీపీ ఫైర్ బ్రాండ్‌?

వైసీపీ మ‌హిళా విభాగం అధ్యక్షురాలు, ఫైర్ బ్రాండ్ రోజా పార్టీ మార‌నున్నారా? ఆల్ రెడీ మ‌రో పార్టీలో చేరేందుకు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారా?  పద్ధతి మార్చుకోకుంటే వేటు తప్పదన్న‌ అధినేత జ‌గ‌న్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారా? జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ అవున‌నే స‌మ‌ధానం వ‌స్తుంది.

కొద్ది రోజుల క్రితం పలు విషయాలపై రోజాకు జగన్ క్లాస్ పీకారని  వార్తలు వ‌చ్చాయి. దీంతో, రోజా ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. అందుకే వీలైనంత త్వరగా వైసీపీకి గుడ్ బై చెప్పాలని రోజా భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ నేపథ్యంలోనే, విశాఖలో జగన్ నిర్వహించిన మహా ధర్నాకు రోజా దూరమయ్యారనే వార్తలు కూడా వినిపించాయి. ప్ర‌స్తుతం జ‌గ‌న్ త‌న‌ను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె భావిస్తున్నార‌ని స‌మాచారం. తనకు, జగన్ కు మధ్య అగాధాన్ని సృష్టించేందుకు పార్టీలో కొందరు నేతలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆమె భావిస్తున్నార‌ని వినికిడి.


పార్టీ కోసం చాలా కష్టపడిన‌ప్ప‌టికీ తనను మనస్తాపానికి గురి చేస్తున్నారని రోజా భావిస్తున్నారట.  ఈ నేపథ్యంలో ఆమె పవన్ కల్యాణ్ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమయ్యారని, త్వరలోనే జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయలసీమకు చెందిన రోజా అక్కడి నుంచే జనసేన తరపున ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. జబర్దస్త్ టీవీ షోలో తన కో-హోస్ట్ అయిన నాగబాబుతో కలసి ఈ మధ్యనే పవన్ కల్యాణ్ ను రోజా కలిశారట.

పవన్ కూడా ఈ ఫైర్ బ్రాండ్‌కు సాదర స్వాగతం పలికారని తెలుస్తోంది. ఈ క్రమంలో, రోజా పార్టీ మారడం మాత్రమే ఆలస్యమని వినికిడి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది అందరికీ తెలిసిన నిజమే! రోజా విషయంలో ఏం జరగబోతోందో కొన్ని రోజుల్లోనే తేలిపోయే అవకాశాలున్నాయి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు