తిడుతున్నారంటే... అవ‌న్నీ లైట్ తీసుకో అనేశాడు

తిడుతున్నారంటే... అవ‌న్నీ లైట్ తీసుకో అనేశాడు

తెలుగు రాష్ర్టాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ షరిషత్ చైర్మన్ పదవి నుంచి తనను తొలిగించడంపై గవర్నర్‌కు ఐవైఆర్ ఫిర్యాదు చేసినట్లు స‌మాచారం.

దీంతో పాటుగా త‌న‌పై సోష‌ల్ మీడియాలో త‌న‌పై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారంపై గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద ఐవైఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. స‌ద‌రు పోస్టులకు అడ్డుక‌ట్ట ప‌డేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఐవైఆర్‌ కోరిన‌ట్లు స‌మాచారం.

కాగా, ఐవైఆర్‌తో భేటీ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసినట్లు స‌మాచారం. సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిగా, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన వ్య‌క్తిగా మీకు గుర్తింపు ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్ అనున‌యించిన‌ట్లు తెలుస్తోంది.

కొంద‌రు స్థాయి దిగ‌జారి పోస్టులు పెట్టార‌ని, మ‌రికొంద‌రు దానికి ప్ర‌చారం క‌ల్పించార‌ని అభిప్రాయ‌ప‌డ్డ గ‌వ‌ర్న‌ర్ ఇలాంటి వాటికి ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ఐవైఆర్‌కు హిత‌బోధ చేసిన‌ట్లు స‌మాచారం. మురుగుకాలువ లాంటి మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉన్న వారి గురించి, వారి పోస్టుల గురించి ఆలోచించకుండా ఉండ‌ట‌మే ఉత్త‌మ‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ సూచించిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సంద‌ర్భంగా బొల్లారంలోని 'రాజాజీ ఇన్‌స్టిట్యూట్‌'లో కొత్తగా పాఠశాల ఏర్పాటు చేయడంతోపాటు దీనిని బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం గురించి గతంలో కూడా ఆయన గవర్నరును కలిసి చర్చించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు