ఉబెర్ సీఈఓ ప‌ద‌వి ఊడ‌బీకేశారు!

ఉబెర్ సీఈఓ ప‌ద‌వి ఊడ‌బీకేశారు!

క్యాబ్‌ల రంగంలో సంచ‌ల‌నం సృష్టించిన ఉబెర్ సంస్థ‌లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ‌ సీఈఓ ట్రావిస్ కళానిక్ రాజీనామా చేశారు. ఉబెర్ లో పెట్టుబడులు పెట్టిన షేర్ షోల్డర్స్ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కాగా ట్రావిస్ కళానిక్ రాజీనామాను ఉబెర్ ప్రతినిధి దృవీకరించారు.

ఉబెర్ సంస్థ సీఈఓగా ట్రావిస్ క‌లానిక్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న సంస్థ బోర్డులో స‌భ్యుడిగా కొన‌సాగ‌నున్నారు. ఉబెర్ సంస్థ‌పై లైంగిక వేధింపుల కేసులు ఎక్కువ‌వుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా,గ‌త వార‌మే ట్రావిస్ త‌ల్లి బోటింగ్ చేస్తూ అక‌స్మాత్తుగా మృతిచెందింది.

ఆ ఘ‌ట‌న‌ను ఆయ‌న సాకుగా చూపుతో సుదీర్ఘ సెల‌వు పెట్టాల‌ని భావించారు. అయితే ఉబెర్ సంస్థ‌లో ఉన్న అయిదుగురు అతిపెద్ద ఇన్వెస్ట‌ర్లు ట్రావిస్‌ను వెంట‌నే త‌ప్పించాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ట్రావిస్ త‌ప్పుకునేందుకు అంగీక‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు